టితో మొదలైనా..!: ఎపి అవతరణ అక్టోబర్ 1?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఆవిర్భవిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో పది జిల్లాల్లో ప్రజలు ఆదివారం అర్ధరాత్రి సంబరాలకు సిద్ధమయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం పైన సర్వత్రా చర్చ సాగుతోంది. దీనిపై రకరకాల చర్చలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2నే సీమాంధ్ర ప్రస్తానం ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్ 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు అసలైన ఆంధ్రప్రదేశ్ 1953లో మద్రాసు నుండి విడిపోయినప్పుడు ఏర్పడింది. ఆ తర్వాత తెలంగాణ కలవడం వేరే విషయం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంపై చర్చ సాగుతోంది.

చంద్రబాబు 8న ప్రమాణ స్వీకారం చేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినట్లు భావించాలని కొందరు సూచిస్తున్నారు. అయితే ఎప్పట్లాగానే 1956లో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన నవంబర్ 1నే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకొందామని మరికొందరు సూచిస్తున్నారు.
తెలంగాణ విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన రోజును వేడుకగా జరుపుకోవడం అసంబద్ధమని ఇంకొందరు చంద్రబాబుకు తేల్చి చెబుతున్నారట. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి 1953లో ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించిన అక్టోబర్ 1వ తేదీని రాష్ట్రావతరణ దినోత్సవంగా జరుపుకుంటే బాగుంటుందని కొందరు అధికారులు చంద్రబాబుకు సూచించారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెబుతున్నారట.
రాష్ట్ర గీతం మా తెలుగుతల్లి
గత 58 సంవత్సరాలుగా రాష్ట్ర గీతంగా ఉన్న 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' ఇకపైనా అదే హోదాలో కొనసాగనుంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ వేరయినప్పటికీ గీతంలో పేర్కొన్న కొన్ని ప్రాంతాలు, కొందరు వ్యక్తులు తెలంగాణకు చెందినప్పటికీ, అంతా తెలుగు తల్లి బిడ్డలే కావడం, శంకరంబాడి సుందరాచారి రాసిన సుప్రసిద్ధం కావడంతో ఇదే గీతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా కొనసాగించాలని నిర్ణయించినట్లుగా సమాచారం.
-
ఆ విషయంలో ఎవరిమాట వినొద్దు అని కలెక్టర్ లకు సీఎం చంద్రబాబు ఆదేశం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications