పవన్ కళ్యాణ్: లేట్ కావచ్చు, కానీ రావడం పక్కా!

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో రాజకీయాలను ఏం చేయబోతున్నారనేది ఇంకా ఆసక్తిగానే ఉంది. జనసేన పార్టీని పూర్తి స్థాయిలో విస్తరించి, ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి దింపుతారా, గత ఎన్నికల్లో బిజెపికి, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినట్లుగానే ఇక ముందు కూడా ఇస్తారా అనేది తేలడం లేదు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో ఆయన ముఖ్య భూమిక పోషిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కొంచెమే అయినా రాజకీయాల గురించి పెదవి విప్పారు.

ఆదివారం సాయంత్రం జరిగిన గోపాల గోపాల సినిమా ఆడియో కార్యక్రమంలో ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు. రాజకీయాలకు భుజం కాస్తాం, రాజకీయ సేవ చేస్తాం అని అన్నారు. అది ఎట్లాగూ ఉంటుందని అంటూ తన ఆధ్యాత్మిక జీవితం గురించి ఎక్కువగా మాట్లాడారు. గోపాల గోపాల సినిమాలో వెంకటేష్‌తో పాటు పవన్ కళ్యాణ్ కూడా నటించారు. ఈ ఇరువురు కూడా ఆడియో కార్యక్రమంలో ప్రసంగించారు. వెంకటేష్ క్లుప్తంగా ముగించగా, పవన్ కళ్యాణ్ కాస్తా ఎక్కువగానే మాట్లాడారు.

Pawan kalyan will continue in politics

తను తన స్వగ్రామం నుంచి హైదరాబాద్ వచ్చిన వైనం గురించి, అందులో తన అన్నయ్య పాత్ర గురించి చాలా మాట్లాడారు. యోగా, ఆధ్యాతికం సాధన చేస్తుంటే తన అన్నయ్య తనను ఈ వైపు మళ్లించి తీరు గురించి వివరించారు. తాను దేవుడ్ని నమ్ముతానని చెప్పారు. దేవుడి దయ వల్లనే ఇంత మంది అభిమానులు ఉన్నారని చెప్పారు. తన సినిమా హిట్ కోసం అభిమానులు ఎలా ఆరాటపడ్డారో వివరించారు. ఇదంతా ఒక ఎత్తయితే, రాజకీయాల ప్రస్తావన మరో ఎత్తు.

సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఓ డైలాగును రాజకీయాలకు కూడా అన్వయిస్తున్నారు. రావడం లేట్ కావచ్చు గానీ రావడం పక్కా అంటూ సినిమాలో ఓ డైలాగు ఉంది. ఆ డైలాగ్ ట్రైలర్‌లో చోటు చేసుకుంది. రాజకీయాల్లోకి తప్పకుండా వస్తాననే సంకేతాన్ని పవన్ కళ్యాణ్ ఆ డైలాగ్ ద్వారా ఇచ్చారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తావన గేయ రచయిత అనంత్ శ్రీరామ్ చేశారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ ప్రజానాయకుడిగా వస్తారో లేదో అని అంటూ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఆ మాట ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ఆయన కార్యక్రమంలో ఆసక్తి పెంచారు. అనంత్ శ్రీరామ్ మాటలను దృష్టిలో ఉంచుకునే పవన్ కళ్యాణ్ ఆ మాటలు చెప్పి ఉంటారని భావిస్తున్నారు. ఏమైనా, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తన వంతు పాత్ర పోషిస్తారనేది మాత్రం ఆదివారంనాటి మాటల ద్వారా అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+