వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగడపాటి రాజగోపాల్ కంపెనీకి షాక్: ఏమైంది?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కుటుంబానికి చెందిన ల్యాంకో తీస్థా హైడ్రో పవర్ లిమిటెడ్‌కు షాక్ తగిలింది. ఐసిఐసిఐ బ్యాంక్ నేతృత్వంలోని పలు బ్యాంకుల నంచి తీసుకున్న రూ313.1 కోట్ల అప్పును ఆ కంపెనీ చెల్లించే పరిస్థితిలో లేదని హైదరాబాద్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యనల్ (ఎన్‌సిఎల్‌టీ) స్పష్టం చేసింది.

దాంతో దివాలా ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. హజేఫా సితాబ్ ఖాన్‌ను దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్‌పి)గా నియమించింది. ల్యాంకో తీస్థా తన ఆస్తుల విక్రయం, బదలాయింపు, తాకట్టు వంటివి చేయరాదని ఆదేశించింది.

దివాలా ప్రక్రియన ప్రారంభమైనట్లు, ఐఆర్‌పి ప్రకటన జారీ చేయాలని ఇన్సాల్వేన్సీ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబిబిఐ) వెబ్‌సైట్‌లో పెట్టడంతో పాటు మీడియా ద్వారా ప్రకటన ఇవ్వాలని, రుణదాతలతో కమిటీ వేసి సంస్థ స్థితిగతులు తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేింది. ఆ మేరకు ఎన్‌ఎస్‌ల్‌టీ జ్యుడిషియల్ సభ్యుదడు విత్తనాల రాజేశ్వర రావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

Rs 313-crore default: IRP appointed for Lanco Teesta

సిక్కింలో తీస్థా నదిపై 500 మెగావాట్ల జల విద్యుచ్ఛక్తి ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాంక్ నేతృత్వంలో పలు బ్యాంకుల నుంచి 2007లో ల్యాంకో రూ.400 కోట్ల రుణం తీసుకుంది. రుణం చెల్లించకపోవడంో ల్యాంకో రుణ ఖాతను నిరర్థక ఆస్తిగా ప్రకటిస్తూ ఐసిఐసిఐ నేతృత్వంలోని బ్యాంకుల జాయింట్ లెండర్స్ ఫోరం నోటీసు జారీ చేసిది.

Recommended Video

Lagadapati Rajagopal to Join Pawan Kalyan's Janasena ?

2017 నవంబర్ 31వ తేదీ నాటికి రుణ బకాయి రూ.313.1 కోట్లకు చేరింది హైడ్రో ఎలక్ట్రికల్ గ్యాస్ ఆధారిత విద్యుత్కేంద్రాల పరిస్థితి తిరోగమనంలోకి వెళ్లడం వల్ల తమకు తీరని నష్టం వాటిల్లిందనే ల్యాంకో తీస్థా న్యాయవాది రవికుమార్ వాదనలను తోసిపుచ్చింది.

English summary
Giving its nod for the initiation of corporate insolvency resolution process against Lanco Teesta LTHPPL, the Hyderabad bench of the NCLT has appointed IRP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X