వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో 'లజ్జ': అసహనంపై తస్లీమా (వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆదివారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేసింది. భారత్ లౌకికవాదులు వంచకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పైన ఓ వర్గం వారు దాడి చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆమె అందులో నిలదీశారు.

భారత దేశంలో లౌకికవాదుల పేరిట చెప్పుకునే వారు వంచనకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను రాసిన 'లజ్జ' పుస్తకాన్ని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అమ్మకానికి పెడితే.. ముస్లిం మతాన్ని ఇష్టపడే కొందరు వచ్చి రాద్ధాంతం చేశారని చెబుతూ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Taslima Nasreen shares video of people protesting against her book

తాను రాసిన లజ్జ పుస్తకాన్ని భారత దేశంలో నిషేధించలేదనే విషయాన్ని అడ్డుకునే వారు పట్టించుకోలేదన్నారు. ఈ విషయం కూడా అసహనమేనని భారత్‌లోని ఏ లౌకికవాద రచయితా చెప్పలేదని, అలాగే, ఆ ఘటనకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు తాను వినలేదన్నారు.

లౌకికవాదులమనిచెప్పుకుంటున్న వారు అప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. తన పుస్తకం అమ్మకాలను అడ్డుకున్న వారు అబద్ధాలు చెబుతున్నారని, తాను ఇస్లాంను విమర్శించని అరుదైన పుస్తకం లజ్జ అని తెలిపారు.

English summary
Acclaimed Bangladeshi writer Taslima Nasreen on Sunday shared a video on social media where slammed a ‘group of fanatics’ for demanding her arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X