దత్త పుత్రుడు మోడీకి పట్టంగట్టిన వారణాసి

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ రికార్డ్ విజయం సాధించింది. స్వయంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు ప్రాతినిథ్యం వహించిన రాయ్ బరేలీ, అమేథిలలోను కమలం సత్తా చాటింది.

డింపుల్ యాదవ్ వచ్చినా.. సీఎం కావాలనుకున్న అపర్ణకు షాక్

ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలోను బీజేపీ తన ప్రతాపం చూపింది. గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీని కాశీ గెలిపించింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీకి జనం బ్రహ్మరథం పట్టారు.

Varanasi treats ‘adopted son’ Modi with bumper votes, BJP gets all seats

ఆయన ఇలాఖా వారణాసిలో అపూర్వ విజయం అందించారు. ఈ సారి వారణాసి సెగ్మెంట్‌లో ఫలితాలు మోడీకి ప్రతికూలంగా ఉంటాయంటూ ప్రతిపక్షాలు, పలువురు విశ్లేషకుల అంచనాలు తప్పయ్యాయి.

ఈ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ కూటమి విజయపతాకం ఎగురవేసింది. వారణాసి జిల్లాలోని మొత్తం ఎనిమిది సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది.

వారణాసి జిల్లాలో మోడీ నియోజకవర్గంలోని అయిదు, పార్లమెంటు నియోజకవర్గేతర సీట్లు మూడింటిలోనూ బీజేపీ అనూహ్య ఫలితాలు రాబట్టింది. రెండు బీఎస్పీ, మరొకటి ఎస్పీ సిట్టింగ్‌ సీట్లను గెలుచుకుంది.

మోడీ చివరిగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన గ్రామీణ రోహనియా ప్రాంతంలో బీజేపీ కూటమికి చెందిన అప్నా దళ్‌ అభ్యర్థి 57 వేల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

ఉత్తర వారణాసిలో 46 వేల ఆధిక్యంతో, వారణాసి కంటోన్మెంట్‌లో 60 వేల భారీ ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మోడీ ప్రచార సభలు నిర్వహించిన ప్రాంతాల్లో కమలం వికసించింది. 26 రోజుల ప్రచార పర్వంలో ప్రధాని మోడీ ఏకంగా 24 ర్యాలీల్లో పాల్గొన్నారు. పలు రోడ్డు షోలకూ హాజరయ్యారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Varanasi treats ‘adopted son’ Prime Minister Narendra Modi with bumper votes, BJP gets all seats.
Please Wait while comments are loading...