సూర్య భగవానుడి తొలి గడప ఏదో తెలుసా: కొత్త ఏడాది స్వాగతం పలికే తొలి.. చివరి దేశాలు ఇవే!

ప్రపంచం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను వెంట బెట్టుకుని మరీ కొత్త ఏడాదిలోకి ప్రవేశించింది. 2019 చివరలో మొదలైన ఈ కరోనా వైరస్ అనే మహమ్మారి.. రెండేళ్లుగా వెంటాడుతూనే వస్తోంది. వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. దీన్ని రూపుమాపడానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ- భయపడట్లేదు. వెనక్కి తగ్గినట్టే తగ్గి.. మరింత వేగంగా బౌన్స్ బ్యాక్ అవుతోంది. ఎప్పటికప్పుడు తన స్వరూపాన్ని మార్చుకుంటోంది.

ఒమిక్రాన్ నామసంవత్సరంగా మిగలకూడదనే..

ఒమిక్రాన్ నామసంవత్సరంగా మిగలకూడదనే..

ఈ సంవత్సరంలోనైనా కరోనా పీడ విరగడ అవుతుందని ఆశించిన ప్రజలకు.. ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ఆందోళనకు గురి చేస్తోంది. ఫలితంగా- భారత్ సహా అనేక దేశాలు ఆంక్షల్లోకి వెళ్లాయి. ఇదివరకట్లా స్వేచ్ఛగా కొత్త సంవత్సరాన్ని స్వాగతించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ 2022.. ఒమిక్రాన్ నామ సంవత్సరంగా మిగిలిపోదనడానికి గ్యారంటీ లేదు. భారత్‌లో రెండు ఒమిక్రాన్ మరణాలు సైతం నమోదు కావడం భయాందోళనలకు గురి చేస్తోంది.

సూర్యుడి తొలి గడప అదే..

సూర్యుడి తొలి గడప అదే..

అదెలా ఉన్నప్పటికీ- ఎన్నో కొత్త ఆశలతో 2022 వచ్చేసింది. పసిఫిక్ మహా సముద్రం తీర ప్రాంత దేశాలు అన్నింటి కంటే ముందుగా కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొంటాయి. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో- ఆ భానుడి లేలేత కిరణాలు తొలిసారిగా ఆ దేశాల మీదే ప్రసరిస్తుండటమే దీనికి కారణం. తొలి పొద్దు పొడిచేది పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంత దేశాల్లోనే. ఆ తరువాతే ప్రపంచం నిద్ర లేస్తుంటుంది. సూర్య భగవానుడి తొలి గడపగా చెప్పుకోవచ్చు.

టోంగా.. సమోవా..కిరబాతి

టోంగా.. సమోవా..కిరబాతి

పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశం.. టోంగా. ఇక్కడి జనాభా లక్షన్నర లోపే. ఓ అసెంబ్లీ నియోజకవర్గం కంటే తక్కువ జనాభా ఉండే దేశం ఇది. కొత్త సంవత్సరం మొట్టమొదటిసారిగా అడుగుపెట్టేది ఈ దేశంలోనే. గ్రీన్‌విచ్ మీన్ టైమ్ ప్రకారం చూసుకుంటే ఉదయం 10:30 గంటలకే ఇక్కడ పొద్దు పొడుస్తుంది. టోంగాలో అర్ధరాత్రి 12 గంటలైతే.. భారత్‌లో మధ్యాహ్నం 3:30 అవుతుంది. సమోవా, కిరిబాతి దీవుల్లోనూ ఒకేసారి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటారు. కొత్త సంవత్సరాన్ని తొలిసారిగా జరుపుకొనే పెద్ద దేశాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా.

చివరి దేశాలు..

చివరి దేశాలు..

కొత్త సంవత్సరం చివరిసారిగా పలకరించే హౌలాండ్ అండ్ బేకర్ ఐలండ్స్. భూగోళం అంచుల్లో ఉండే ద్వీపదేశాలివీ. దీని తరువాత మళ్లీ టోంగా, సమోవా, కిరిబాతిల్లో సూర్యోదయమౌతుంది. నిజానికి ఈ రెండూ టోంగా, సమోవాలకు సమీపంలోనే ఉంటాయి. విభజన రేఖ, భౌగోళిక స్థితిగతులు..సూర్యోదయాస్తమానాలను ప్రాతిపదికగా తీసుకుంటే భూగోళానికి ఒకింత అంచున ఉన్నట్టుగా నిర్దారించారు. ఉత్తర అమెరికా ఖండం పరిధిలో ఉంటాయివి.

ఐఎస్టీ ప్రకారం..

ఐఎస్టీ ప్రకారం..

ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం.. మధ్యాహ్నం 3:30 గంటలకు టోంగా, సమోవా, కిరిబాతి, న్యూజిలాండ్ కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొంటాయి. ఆస్ట్రేలియా 6:30 గంటలకు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుంది. జపాన్, దక్షిణకొరియా, ఉత్తరకొరియా రాత్రి 8:30కు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. రాత్రి 9:30 గంటలకు చైనా, ఫిలిప్పీన్స్, సింగపూర్‌లల్లో న్యూ ఇయర్ ఎంట్రీ అవుతుంది.

బంగ్లాదేశ్-11:30 నిమిషాలు, నేపాల్-11:45 నిమిషాలు, భారత్, శ్రీలంక-12 గంటలు, పాకిస్తాన్-12:30లకు కొత్త సంవత్సరంలో అడుగు పెడతాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, స్పెయిన్‌లల్లో తెల్లవారు జామున 4:30, బ్రిటన్, ఐర్లాండ్, ఐస్‌లాండ్, పోర్చుగల్‌లల్లో 5:30 గంటలకు కొత్త సంవత్సరం మొదలవుతుంది.

జనవరి 1న

ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం.. జనవరి 1వ తేదీన ఉదయం 7:30 గంటలకు బ్రెజిల్‌లోని కొన్ని రీజియన్లలో అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, పరాగ్వేల్లో 8:30 గంటలకు కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొంటారు. న్యూయార్క్, వాషింగ్టన్, డెట్రాయిట్-10:30, చికాగో-11:30, కొలరాడో, అరిజోనా-12:30, నెవాడా-1:30, అలస్కా-2:30, హవాయ్-3:30లల్లో కొత్త సంవత్సరం ఎంట్రీ ఇస్తుంది. అమెరికన్ సమోవా-సాయంత్రం 4:30, హౌలాండ్ అండ్ బేకర్స్ ఐలండ్స్‌లల్లో 5:30 గంటలకు కొత్త ఏడాది ప్రవేశిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+