జగన్ ఆ ఛాన్స్ ఉపయోగించుకోలేదు, సర్వనాశనం: జేసీ, కేశినేని హెచ్చరిక
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, కేశినేని నానిలు మంగళవారం నిప్పులు చెరిగారు.
అమరావతి/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, కేశినేని నానిలు మంగళవారం నిప్పులు చెరిగారు.

జగన్ సీఎం అయితే సర్వనాశనం
జగన్ ముఖ్యమంత్రి అయితే సర్వనాశనం తప్పదని జేసీ వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్, జగన్ సీఎం అయితే మళ్లీ వెనుకబడిపోతుందని చెప్పారు. ఆయన జీవితంలో సీఎం కాలేడన్నారు.

జగన్ అప్పుడు ఉపయోగించుకోలేదు
గతంలో జగన్ కు అవకాశం ఉన్నప్పటికీ, దానిని ఆయన సరిగా ఉపయోగించుకోలేకపోయారని జేసీ తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే చంద్రబాబునే మళ్లీ గెలిపించాలన్నారు. చంద్రబాబు ఎంతో దూరదృష్టి ఉన్న నాయకుడని కొనియాడారు.

బంగాళాఖాతంలో పడేయాలి
జగన్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలని కేశినేని నాని అన్నారు. రూ.60 కోట్ల కుంభకోణానికి అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిందని, ఈ రకంగా చూసుకుంటే లక్ష కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్‌కు 200ఏళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు.

జగన్‌కు హెచ్చరిక
హత్యా రాజకీయాలను, శవ రాజకీయాలను జగన్ మానుకోవాలని కేశినేని నాని సూచించారు. లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం నేర్పిస్తారని నాని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసిపి నేత నారాయణ రెడ్డి హత్యకు సంబంధించి చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తిలపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్‌పై కేశినేని విమర్శలు గుప్పించారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications