చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా కళ్లలో కారం కొట్టి, ఆమె ఎక్కడ: జయ మృతిపై బాంబు పేల్చారు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రక్తంతో కూడిన గాయాలతో అపోలో ఆస్పత్రిలో చేరారని అన్నాడీఎంకే సీనియర్ నేత పొన్నయన్ ఆరోపించారు. అమ్మ మరణంపై సమగ్ర విచారణ జరపాలని పన్నీరు సెల్వం వర్గం విజ్ఞప్తి చేసింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రక్తంతో కూడిన గాయాలతో అపోలో ఆస్పత్రిలో చేరారని అన్నాడీఎంకే సీనియర్ నేత పొన్నయన్ ఆరోపించారు. అమ్మ మరణంపై సమగ్ర విచారణ జరపాలని పన్నీరు సెల్వం వర్గం విజ్ఞప్తి చేసింది.

ఈ నేపథ్యంలో ఆమె మరణం అంతుచిక్కని కథలా మిగిలిపోయిందని పొన్నయన్ అన్నారు. సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి పోయెస్ గార్డెన్‌లోని ఇంట్లో జయలలిత దాడికి గురయ్యారని, కిందపడిపోయారని, అనాథలా ఆమెను అపోలోలో చేర్చారన్నారు.

మా కళ్లల్లో కారం కొట్టి, అమ్మ చెంపపై రక్తపు మరకలతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారని తెలిపారు. జయలలిత కింద పడినప్పుడు కళ్లారా చూసిన పనిమనిషి కనిపించట్లేదని, ఆమె ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు.

జయలలితపై కుట్ర లేదు, దాడి జరగలేదు, ఇలా మృతి: పన్నీరుకు ప్రభుత్వం షాక్జయలలితపై కుట్ర లేదు, దాడి జరగలేదు, ఇలా మృతి: పన్నీరుకు ప్రభుత్వం షాక్

OPS camp on Jayalalithaa's death

జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని, ఇడ్లీ తిన్నారని తాము చెప్పామని, అలా చెప్పాలని లోకసభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై చెప్పారని బాంబు పేల్చారు. తంబిదురై చెప్పినట్లే తాము కూడా మీడియాతో చెప్పామన్నారు.

ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే ర్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నిక విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ నెల 10వ తేదీలోపు వివరణ ఇస్తామని అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ తెలిపారు.

ఆయన సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు, మంత్రులు, కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.

అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నదని తెలిపారు. కానీ, ఈ ఎన్నిక చెల్లదని పేర్కొంటూ ఈసీ నోటీసు జారీ చేయగా, దానికి తాను వివరణ ఇచ్చామన్ానరు.

అయితే, ఈ వివరణను చెల్లదని, శశికళే స్వయంగా వివరణ ఇవ్వాలని ఈసీ కోరిందని గుర్తు చేశారు. అందువల్ల శశికళ ఇవ్వనున్న వివరణ లేఖను తమారు చేస్తున్నామని ఈనెల 10వ తేదీలోపు దీన్ని ఎన్నికల సంఘానికి పంపిస్తామన్నారు.

English summary
Former Chief Minister O Panneerselvam camp on Jayalalithaa's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X