Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!

పాకిస్తాన్ తో చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్ (iran) పోర్టుల్లో నుంచి రాకపోకలు సాగించే నౌకల్ని హార్ముజ్ (hormuz)చుట్టుపక్కల వెళ్లనివ్వకుండా దిగ్బంధిస్తామని బీరాలు పలికిన అమెరికా (US)కు ఇవాళ గట్టి షాక్ తగిలింది. అమెరికా దిగ్బంధాన్ని దాటి రెండు నౌకలు ఇరాన్ పోర్టుల నుంచి హార్ముజ్ మీదుగా వెళ్లిపోయాయి. తద్వారా అమెరికా దిబ్బంధానికి గట్టి సవాల్ విసిరాయి. అలాగే అంతర్జాతీయంగా అమెరికా మరోసారి పరువు పోగొట్టుకున్నట్లయింది.

Hormuz Showdown: హార్ముజ్ లోనే తాడోపేడో..! అమెరికా-ఇరాన్ లో గెలిచేదెవరు ?
Hormuz Showdown: హార్ముజ్ లోనే తాడోపేడో..! అమెరికా-ఇరాన్ లో గెలిచేదెవరు ?

అమెరికా సైనిక దిగ్బంధనం ఉన్నప్పటికీ, ఇవాళ కనీసం రెండు నౌకలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాయని, సముద్రయాన ట్రాకింగ్ సంస్థ క్ప్లర్ డేటా చెబుతోంది. లైబీరియా జెండా కలిగిన 'క్రిస్టియానా' అనే బల్క్ క్యారియర్, ఇరాన్‌లోని బందర్ ఇమామ్ ఖొమేనీ ఓడరేవులో మొక్కజొన్నను దించిన తర్వాత ఈ వ్యూహాత్మక జలసంధి గుండా ప్రయాణించి, ఇరాన్‌లోని లారాక్ ద్వీపాన్ని దాటింది. ఇది అమెరికా దిగ్బంధనం అమల్లోకి వచ్చిన రెండు గంటల తర్వాత జరిగింది.

US Blockade Challenged Two Ships From Iran Ports Slip Past Naval Enforcement in Hormuz
US- Iran War : మళ్లీ మొదలైన వార్..! హార్ముజ్ లో అమెరికా-గల్ఫ్ పై ఇరాన్..!
US- Iran War : మళ్లీ మొదలైన వార్..! హార్ముజ్ లో అమెరికా-గల్ఫ్ పై ఇరాన్..!

అలాగే రెండవ నౌక కొమొరోస్ జెండా కలిగిన 'ఎల్పిస్' అనే ట్యాంకర్. ఇది లారాక్ ద్వీపం సమీపంలో హార్ముజ్ జలసంధిని దాటినట్లు డేటా చెబుతోంది. ఇది 31,000 టన్నుల మెథనాల్‌ను తీసుకువెళుతూ మార్చి 31న ఇరాన్‌లోని బుషెహర్ ఓడరేవు నుండి బయలుదేరింది. ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాల్లోకి ప్రవేశించే లేదా బయలుదేరే అన్ని దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని యూఎస్ సెంట్రల్ కమాండ్ హెచ్చరికలు చేశాక ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రిచ్ స్టార్రీ అనే ఒక చైనీస్ ట్యాంకర్ కూడా లారాక్ ద్వీపానికి దక్షిణంగా ఉన్న ఇరాన్ ఆమోదించిన తనిఖీ మార్గం ద్వారా రాత్రికి రాత్రే జలసంధిని దాటినట్లు సమాచారం. దాని ట్రాన్స్‌పాండర్ డేటా ప్రకారం 31,500 టన్నుల మిథనాల్‌ను తీసుకని ఒమన్‌లోని సోహార్‌కు వెళుతోందని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+