Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

5 ఏళ్ల రిలేషన్... అతనిని మరిచిపోలేకపోతున్నా.. హీరోతో బ్రేకప్‌పై నటి ఎమోషనల్

కర్ణాటకకు చెందిన వారైనా, తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు బుల్లితెర నటులు నిఖిల్ మలియాక్కల్, కావ్యశ్రీ. వీరిద్దరూ ఒకప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఈ జంట అనూహ్యంగా విడిపోయి అభిమానులకు షాకిచ్చింది. అంతేకాదు కనీసం ఫ్రెండ్స్‌లా కూడా మెలగకుండా బద్ద శత్రువుల్లా కత్తులు దూసుకుంటున్నారు కావ్య- నిఖిల్. ఎప్పటికైనా వీరిద్దరూ తిరిగి కలిసిపోతారని అంతా భావిస్తుండగా వీరి పరిస్ధితి చూస్తే మాత్రం అది కష్టమే అనిపిస్తోంది. తాజాగా తమ బ్రేకప్‌పై కావ్యశ్రీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలా ? 50 మంది మధ్య ఇరుక్కున్న నటి!

కావ్య శ్రీ తొలుత కన్నడంలో నీలి, నాయకి, మహాకాళి తదితర సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగులో 2019లో స్టార్ మాలో ప్రసారమైన గోరింటాకు సీరియల్‌తో తెలుగువారిని పలకరించారు. ఈ క్రమంలో కోయిలమ్మ, గువ్వా గోరింకా తదితర సీరియల్స్‌తో తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యారు. గోరింటాకు సీరియల్‌లో తనతో కలిసి నటించిన బిగ్‌బాస్ తెలుగు 8 విజేత నిఖిల్‌ మలియాక్కల్‌తో కావ్యకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరి మధ్య ఏదో జరుగుతోందని మీడియాలో ఊహాగానాలు వినిపించగా.. నిఖిల్ - కావ్యలే తమ బంధాన్ని బయటపెట్టారు.


Kavya Shree Shocking Comments on Love Life After Breakup With Nikhil Maliyakkal at Come 2 Dhee Party

రిలేషన్ బయటపడిపోవడంతో నిఖిల్ - కావ్యశ్రీలు వివిధ ఛానెల్స్‌లో జరిగే కార్యక్రమాలకు కలిసే హాజరయ్యేవారు. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్‌గా పాల్గొనడానికి అవకాశం రావడంతో నిఖిల్ అటు వైపు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏకంగా బిగ్‌బాస్‌ విన్నర్‌గా నిలిచి షాకిచ్చాడు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ కావ్యతో నిఖిల్ బ్రేకప్ చెప్పేసినట్లుగా మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత ఈ గాసిప్స్ నిజమయ్యాయి.

Pushpa 2 Japan Box Office: షాకింగ్‌గా పుష్ప 2 జపాన్ కలెక్షన్లు..అల్లు అర్జున్ మూవీ బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి?

ఒకే కార్యక్రమంలో కలిసి పాల్గొంటున్నా ఒకరి ముఖం మరొకరు చూసుకోకుండా పక్కకు తిప్పుకుని వెళ్లిపోవడంతో బుల్లితెర వర్గాలు, ప్రేక్షకులు షాక్ అయ్యారు. కావ్యతో రిలేషన్‌పై నిఖిల్ స్పందిస్తూ... ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఎవరి జీవితాలు వారివేనని .. తనను ఎవరితోనూ కలపొద్దని, ఎవరి పోస్టులకు తనను ట్యాగ్ చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అటు కావ్య కూడా ఇదే రకమైన ఆన్సర్లు ఇచ్చింది.. పలు కార్యక్రమాల్లో నిఖిల్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా సీరియస్‌ అయ్యేది. నేను ఎక్కడికి వెళ్లినా ఇదొక గోలగా మారిపోయిందని. ఎవరైనా ఆ టాపిక్ ఎత్తితే వాళ్లకు కూడా అదే పరిస్ధితి రావాలంటూ వార్నింగ్ ఇచ్చేవారు. తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చిన సీనియర్ జర్నలిస్ట్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ జాఫర్.. కావ్యను సరదాగా ఇంటర్వ్యూ చేసే క్రమంలో బ్రేకప్ గురించి టచ్ చేశారు.

ఈ మధ్య మీరు లవ్ ట్రాక్ నుంచి బయటకు వచ్చారు, అందరికీ తెలిసిందే, పూర్తిగా బ్రేకప్ అయిపోయిందా అని జాఫర్ ప్రశ్నించగా.. అయిపోయింది, ఏం లేదని కావ్య ఆన్సర్ ఇచ్చింది. దీనికి రీజన్ ఏంటనీ జాఫర్ అడగ్గా.. నేను నాకు ఓకే కరెక్ట్ అనిపించిన రీజన్స్ చెబితే అవతలి వాళ్లకి రాంగ్ అనిపించొచ్చు. వాళ్లు చెప్పే రీజన్ మనకు రాంగ్ అనిపించొచ్చు అలా బ్రేకప్ జరిగిపోయిందని కావ్య ఆన్సర్ ఇచ్చింది. మా ఇద్దరి ఐదున్నర సంవత్సరాల పాటు రిలేషన్ నడిచింది.. సీరియల్స్ ద్వారా పరిచయం ఏర్పడి, ఈ రిలేషన్ తాలూకా జ్ఞాపకాల నుంచి బయటపడాలని అనుకుంటున్నా వాళ్ల కావడం లేదని ఒక ఏడాదిన్నరగా మా మధ్య ఏం లేదని ఎమోషనల్ అయ్యింది కావ్య.

Dragon: ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ.. జక్కన్న ఫార్ములాతో ప్రశాంత్ నీల్

కానీ ఏం జరిగినా ఆ అమ్మాయి మామూలు అయిపోయి.. ఇప్పుడు అన్ని ఛానెల్స్‌లో పనిచేస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తోంది. తను ఏం చేసినా 100 పర్సెంట్ ఇస్తుంది. ఆ విధంగా కావ్యను చూడటం మా అందరికీ చాలా హ్యాపీగా ఉందని ఆది ప్రశంసించారు. ప్రేమ, బ్రేకప్ ఇది ఒక్కటే జీవితం కాదు.. మనకి తల్లిదండ్రులు ముఖ్యం, మనల్ని నమ్ముకుని పేరెంట్స్ ఉంటారు.. ఇలాంటి వాటికి మనం బాధపడితే వాళ్లు కూడా చాలా బాధపడతారు, వాళ్లని హ్యాపీగా చూసుకోవాలని కావ్యశ్రీ చెప్పింది. ప్రస్తుతం కావ్యశ్రీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బ్రేకప్ జరిగినా స్ట్రాంగ్‌గా ఉందని ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Credit: Filmibeat

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+