Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

The RajaSaab: డిజాస్టర్‌ దిశగా ది రాజాసాబ్... ప్రభాస్ జాతకంపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఎవ్వరికీ అందని స్థాయిలో ఉన్నారు. బాలీవుడ్‌, టాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రభాస్‌కు దరిదాపుల్లో వచ్చే స్టార్ మరొకరు లేరు. ఆయన పేరు మీద వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూకడుతున్నారు. ఇలాంటి స్థాయిలో ఉన్న ప్రభాస్‌కు గట్టి షాకిచ్చింది ది రాజాసాబ్. భారీ అంచనాల నడుమ సంక్రాంతికి బరిలోకి దిగిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ జాతకంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..


Venu swamy s Controversial Predictions on Prabhas s Horoscope Amid The Raja Saab movie result

400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రాజాసాబ్
ది రాజాసాబ్ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌‌లు హీరోయిన్‌లుగా నటించారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ది రాజాసాబ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 250 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి.. ప్రభాస్ స్టామినో ఏంటో మరోసారి నిరూపించింది ఈ సినిమా.

MSVPG Day 7 Box Office Collections: 300 కోట్ల క్లబ్‌‌లో మన శంకరవరప్రసాద్ గారు.. చిరు మూవీకి ఎన్ని కోట్లంటే ?

10 రోజుల్లో ది రాజాసాబ్ కలెక్షన్స్
అయితే ప్రీమియర్ షో నుంచే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావటంతో ది రాజాసాబ్ కోలుకోలేకపోయింది. ప్రభాస్ మూవీ విడుదలై ఇప్పటి వరకు 10 రోజులు కావొస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఇండియాలో 136.75 కోట్ల రూపాయల నెట్... 163.4 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో దాదాపు 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో వరల్డ్ వైడ్‌గా ప్రభాస్ మూవీ ఇప్పటి వరకు 196.65 కోట్ల రూపాయలు రాబట్టింది.

ప్రభాస్ ఎదుట భారీ టార్గెట్
అయితే తమ చిత్రం ఇప్పటికే 200 కోట్ల రూపాయల మార్క్ దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్ధ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. అలా చూసుకున్నప్పటికీ ది రాజాసాబ్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 250 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. సంక్రాంతి సినిమాల నుంచి గట్టి పోటీకి తోడు, మిక్స్‌డ్ టాక్, సంక్రాంతి సెలవులు ఆదివారంతో ముగియనుండటంతో రానున్న రోజుల్లో ది రాజాసాబ్ నెగ్గుకు రావడం కష్టమేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది.

సుడిగాలి సుధీర్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన 'ఢీ’ షో బ్యూటీ..

ప్రభాస్ జాతకంపై వేణుస్వామి కామెంట్స్
ది రాజాసాబ్ రిజల్ట్ నేపథ్యంలో ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి.. కొద్దినెలల క్రితం ప్రభాస్ జాతకం, సినిమాలు, ఆయన కెరీర్‌పై చెప్పిన జ్యోస్యం తాలూకా వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రీ పోస్ట్ చేశారు. ప్రభాస్ జీవితంలో మంచి రోజులు అయిపోయాయని, ఆయనతో సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేవని అప్పట్లో వ్యాఖ్యానించారు. దానికి తగినట్లుగానే రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్ తదితర చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. అయితే సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలు భారీ వసూళ్లను సాధించడంతో వేణుస్వామిపై ప్రభాస్ అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు.

ప్రభాస్ ఆరోగ్యం గురించి వ్యాఖ్యలు
అయితే ఇప్పుడు రాజాసాబ్ ఫలితం నేపథ్యంలో వేణుస్వామి తిరిగి యాక్టీవ్ అయ్యారు. ప్రభాస్ జాతకంపై గతంలో చేసిన జ్యోస్యం తాలూకా వీడియో క్లిప్‌ను పంచుకున్నారు. ప్రభాస్ గారి జాతకం చాలా విచిత్రమైనది.. నాకు తెలిసి టాలీవుడ్‌లో రెండే రెండు విచిత్రమైన జాతకాలు. ఒకటి ప్రభాస్, రెండోది రాజమౌళి. ప్రభాస్‌ది తులారాశి.. ఆయన జీవితంలో హైట్స్ అయిపోయాయి. ప్రభాస్‌తో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లంతా జాతకాలు చూపించుకోవాల్సిందే. ఎందుకంటే ప్రభాస్ కెరీర్ కష్టమని ఓ వీడియోలో వేణుస్వామి తెలిపారు. మరో దానిలో నేను కేవలం ప్రభాస్ గారి ఆరోగ్యం గురించే, పెళ్లి గురించే. ప్రభాస్ సినిమాల గురించి నేను మాట్లాడలేదు. మినిమమ్ గ్యారంటీ ఉన్న హీరోలతో తీస్తే నడుస్తుంది. సలార్ సినిమా గురించి ట్రోల్ చేశారు. వాస్తవంగా సలార్ మూవీ బ్రేక్ఈవెన్ కాలేదు అని వేణుస్వామి అన్నారు.

డిమోన్ పవన్‌తో రెచ్చిపోయిన రీతూ చౌదరి... చెత్త పనులు వద్దంటూ నటి వార్నింగ్

ప్రభాస్ డ్యాన్స్‌లు ఎందుకు చేయడం లేదు
130 కోట్ల రూపాయల మైనస్ సినిమా. ప్రొడ్యూసర్లు బయటికొచ్చి సక్సెస్ అయ్యిందంటూ కేక్‌లు కట్ చేసి హంగామా చేశారు. వాళ్లకు కూడా తెలుసు.. ప్రభాస్ గారికి కూడా సినిమా ఫెయిల్యూర్ అని తెలుసు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత డప్పుకొట్టినా సినిమా ఫెయిల్యూర్. ప్రభాస్ ఆరోగ్యం బాలేదు, ప్రభాస్‌కు పెళ్లికాదు. ఎందుకు కాదు అన్న ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభాస్ మీద ఉంది. ఎందుకు సక్సెస్ కావడం లేదు. అసలు ప్రభాస్ సినిమాలో ఎందుకు డ్యాన్స్ చేయడం లేదు. మిర్చి సినిమాలో చేసినట్లు ఎందుకు డ్యాన్స్‌లు చేయడం లేదు. ఛత్రపతి సినిమాలో కాలు పైకి లేపి విలన్లకు వార్నింగ్‌లు ఇవ్వడం లేదు. ఇవి నా ప్రశ్నలు. ఒక ఫ్యాన్‌గా నేనే అడుగుతున్నాను... ప్రభాస్ గారి నుంచి డ్యాన్స్‌లు, ఫైట్స్ చూడాలనుకుంటున్నా. ఆయన బాగుపడాలి, ఇంకా పదికాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నా అని వేణుస్వామి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ముగిసిపోయిన పంచాయతీని వేణుస్వామి మళ్లీ కదుపుతున్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Credit: Filmibeat

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+