• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కర్కాటక రాశి వారు పెట్టుబడులు పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

కర్కాటకరాశి వారికి 2020 లో గోచార ఫలితములు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆదాయం - 11 వ్యయం - 5 రాజపూజ్యం - 5 అవమానం - 4

• వ్యయంలో ఉన్న రాహువు, షష్టమంలో ఉన్న కేతువు, సప్తమంలో ఉన్న శని, షష్టమంలో ఉన్న గురువు.

• ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి.

Cancer 2020 Horoscope - Major Life Changes to expect!

• సాంకేతిక, వ్యాపార రంగాల శ్రమకు తగిన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

• వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం.

• అనవసరమైన పెట్టుబడులు పెట్టవద్దు, ముఖ్యంగా షేర్ మార్కెట్ విషయంలో

• పనిగట్టుకుని మీ ప్రత్యర్థి వర్గాన్ని కారణం చూపి ఇబ్బందిపాలు చేయగలుగుతారు.

• ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవహారంలో, కార్యవిజయంలో లాభిస్తుంది.

• కొంత మంది వారికి మీ ప్రత్యర్ధుల మీద ద్వేషంతో మీకు అభిమానంగా మారి సహాయపడతారు.

• సాహిత్య, కళా, విద్య, పరిశోధన రంగాలవారి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది.

• కలలుగన్న గమ్యాన్ని చేరుకుంటారు.

• దైవానుగ్రహం మీరు పొందగలిగితే గౌరవం, కీర్తిప్రతిష్టలు లభిస్తాయి.

• తల్లికి, కూతురికి సంబధించిన ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు అవసరం.

• సంతానం మూలకంగా కొన్ని సమస్యలు తలనొప్పులు ఏర్పడతాయి.

• ప్రతి చిన్న విషయానికి పలుకుబడి ఉపయోగించాల్సి వస్తుంది.

• రాజకీయ నాయకుల జోక్యం కూడా అనివార్యం అవుతుంది.

• చండీ అమ్మవారి అనుగ్రహం, గురువుల అనుగ్రహం వలన ఆపదలు తప్పించుకోగలిగితే అదృష్టమేనని గ్రహించాలి.

• స్పెక్యులేషన్స్‌, సేల్స్‌ సంవత్సర ప్రారంభంలో ఎక్కువ ఆసక్తి కలుగజేస్తాయి.

• కొన్నింటిలో మనస్సు ఎంత వద్దనుకున్నా ఆ మార్గాల వైపు లాగుతుంది.

• స్థిరాస్తి వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు.

• జాతకంలో సర్పదోష ఉంటే,ఆ నివారణ చేయడం వలన సర్పదోషాలు, గ్రహా బాధలు తొలగిపోతాయి.

• ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

• కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టులు, లైసెన్స్‌లు, లీజులు పొడిగించే వంటి విషయాలు లాభిస్తాయి.

• జీవితభాగస్వామితో సఖ్యత చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది.

• వ్యాపారంలో రొటేషన్‌, లాభాలు బాగుంటాయి.

• సమస్యలను అధిగమించాలంటే చండీ హోమం, నవగ్రహ జపం చేయించుకోవడం అవసరం.

మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.

English summary
people with Cancer as zodiac sign will witness profits in Agriculture
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X