కేంద్ర బడ్జెట్ 2018: వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు.. అదే ప్రధాని మోడీ లక్ష్యం: అరుణ్ జైట్లీ
Recommended Video

న్యూఢిల్లీ: 75వ స్వాతంత్రం దినోత్సవం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నది ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని అరుణ్ జైట్లీ తెలిపారు. గురువారం లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడారు.
వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి కోసం రూ.2వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మార్కెట్ ధర తక్కువగా ఉన్నప్పటికీ రైతుల నుంచి మద్ధతు ధరకే కొనుగోలు చేస్తున్నామన్నారు.

మార్చి నాటికి 585 మార్కెట్లను ఈనామ్‌కు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం, పప్పు దినుసుల మద్దతు ధర ఒకటిన్నర రెట్లు పెంచినట్లు తెలిపారు. వ్యవసాయ ఎగుమతుల్లో సరళీకరణకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
సేంద్రియ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు జైట్లీ తెలిపారు. పాడి రైతులు, ఆక్వా రైతులు సహా దేశంలోని రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు. ఆహార శుద్ధి రంగానికి రూ.1,400కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఆహారశుద్ధి, వాణిజ్య శాఖలతో కలిసి వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో క్లస్టర్ ఏర్పాటుతో మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications