Accenture: లేఆఫ్స్ వేళ యాక్సెంచర్ గుడ్ న్యూస్-కొత్త ఉద్యోగాలపై..!

కృత్రిమ మేథ, ఆటో మేషన్ కారణాలతో భారీ సంఖ్యలో ఉద్యోగాల్లో కోతలు పెడుతున్న యాక్సెంచర్.. కొత్త ఉద్యోగాలపై మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా తాజాగా తమ వద్ద ఉన్న వేలాది ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇచ్చి కొనసాగించే పరిస్ధితి లేకపోవడంతో లేఆఫ్స్ ఇచ్చి పంపించేస్తున్న యాక్సెంచర్.. త్వరలో చేపట్టబోయే తమ ప్రణాళికల్ని ఇవాళ బయటపెట్టింది. ఈ మేరకు యాక్చెంచర్ సీఈవో జూలీ స్వీట్ కీలక ప్రకటన చేసారు.

ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు కృత్రిమ మేతను వాడుకుని ఉద్యోగాల్లో కోతలు పెడుతున్న వేళ యాక్చెంచర్ కూడా తాజాగా అదే బాట పట్టింది. తమ కంపెనీలో ఆటోమేషన్ కారణంగా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించడం ప్రారంభించింది. దీంతో వేలాది ఉద్యోగాలు ఆవిరైపోయాయి. ఉన్న ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాలు నేర్పించే పరిస్ధితి లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు యాక్చెంచర్ కొత్త ఉద్యోగ నియామకాలకు సిద్దమవుతున్నట్లు సీఈఓ జూలీ స్వీట్ ప్రకటించారు.

Accenture to Expand Workforce After AI-Driven Job Cuts Says CEO Julie Sweet

కన్సల్టింగ్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన యాక్చెంచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మార్పుల కోసం ఉద్యోగులతో పాటు, కంపెనీకి అవసరమైన కొత్త నైపుణ్యాలను కలిగి ఉన్న వారిని నియమించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కంపెనీల్లో విభాగాల వారీగా పరిశీలించి, అవసరమైన నైపుణ్యాలు లేని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈవో తెలిపారు. ఈ ప్రక్రియలో తాము అవసరమైన నైపుణ్యాలు ఉన్న వారిని అదనంగా నియమించేందుకు దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.

Accenture to Expand Workforce After AI-Driven Job Cuts Says CEO Julie Sweet

తాజాగా భారీగా ఉద్యోగాల్లో కోతలు పెట్టినప్పటికీ.. అమెరికా, యూరప్ మార్కెట్లలో డిమాండ్ పెరుగుతోందని యాక్చెంచర్ తెలిపింది. ఎక్సెంజర్ ట్రెండ్స్ ప్రకారం ఇలా ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నట్లు సీఈవో జూలియా స్వీట్ వెల్లడించారు. 2023లో తమ కంపెనీ దాదాపు రెండింతలు ఏఐ , డేటా ప్రొఫెషనల్స్‌ను పెంచిందని, 5.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐ ట్రైనింగ్ కూడా ఇచ్చిందని తెలిపారు. అడ్వాన్స్డ్ ఏఐ ఇప్పుడు తమ ప్రతి కార్యకలాపంలో భాగమవుతోందన్నారు.
ఈ క్రమంలోనే సంస్ధలో ఏఐ అభివృద్ధి దిశగా పయనిస్తున్నామని, ఉద్యోగాల కోతల్లో కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+