AI ఏజెంట్లు ఎంట్రీతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల భవిష్యత్ కష్టమేనా..!?
ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. అన్ని కీలక రంగాల్లో ఇప్పటి కే ప్రభావం చూపుతోంది. లక్షల్లో ఉద్యోగాలను ప్రమాదంలోకి నెట్టింది. ఇక, ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ అనేది ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు ఏంటీ ఏఐ ఏజెంట్ల వ్యవస్థ. ఎలా వినియోగాస్తారనే అంశం తో పాటుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల భవిష్యత్ పైన ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఐటీ పరిశ్రమలో ఆసక్తి కర చర్చగా మారుతోంది.
ఆర్టీపీషీయల్ ఇంటలిజెన్స్ లో ఇప్పుడు ఎక్కువగా వింటున్న అంశం ఏఐ ఏజెంట్స్. ఒకే రకమైన పనులను రిపీట్‌గా చేసేందుకు రూపొందించిన సాధనాలే ఈ ఏఐ ఏజెంట్స్. ఓపెన్ ఏఐ ఇటీవల రెండు ఏఐ ఏజెంట్లను రూపొందించింది. సింగిల్ కమాండ్‌తో టికెట్ బుకింగ్, ఆన్‌లైన్ ఆర్డర్ వంటి పనులను చేసే విధంగా వీటిని అభివృద్ధి చేశారు. ఈ ఏఐ జెంట్స్ భవిష్యత్తుల్లో ఒక సాధారణ ఉద్యోగి లాగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏఐ ఏజెంట్స్ కోడింగ్‌ను కూడా సమర్ థవంతంగా చేయగలవు. ఈ ఏజెంట్లు మనుషులు చేసే పనులు చేసినప్పటికీ నాణ్యత, ఆవిష్కర ణలకు సంబంధించి పర్యవేక్షించేందుకు నిపుణులు అవసరమని పేర్కొంటున్నారు.

కాగా, ఏఐ ఏజెంట్ల ప్రభావం కచ్చితంగా ఉద్యోగాలపై పడుతుందని నిపుణుల అంచనా. ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐ ఏజెంట్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి. గూగుల్, మెటా వంటి పెద్ద కంపెనీలు తమ వర్క్ ఫోర్స్‌లో వీటిని ఉపయోగించుకుంటున్నాయి. గూగుల్ తన కోడ్ నిర్మాణం లో ఎక్కువ భాగాన్ని ఏఐతోనే రూపొందిస్తుంది. అదే విధంగా మెటా కూడా ఏఐ ఏజెంట్స్‌తో కలిసి పనిచేస్తుంది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా AI మిడ్-లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను భర్తీ చేస్తుందని చెప్పారు. దీంతో, ఇప్పుడు ఈ ఏఐ ఏజెంట్ల వినియోగం.. ఫలితాల పైన ఆసక్తి పెరిగింది. ఏ విధంగా మార్కెట్ లో రానున్న రోజుల్లో ప్రభావం చూపిస్తాయి.. ఉద్యోగాల పైన ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది అనే అంశం కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications