తొలి త్రైమాసికంలోనే దుమ్మురేపిన ఏఐ, ఎంఎల్ ఉద్యోగాలు..! ఈ రంగాల్లో ..!
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావంతో ఉద్యోగాల స్వరూపం మారిపోతోంది. అలాగే ఉద్యోగ అవకాశాల తీరు కూడా మారిపోతోంది. కొత్తగా సంస్ధలు కల్పిస్తున్న ఉద్యోగాలపై ఏఐ, మెషిన్ లెర్నింగ్ ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఏఐ, మెషిన్ లెర్నింగ్ నైపుణ్యాలు కలిగిన వారినే సంస్థలు ఉద్యోగాల్లో తీసుకుంటున్నట్లు తేలింది.
ఈ ఆర్దిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ నైపుణ్యాలు కలిగిన వారిని సంస్థలు రిక్రూట్ చేసుకునే సంఖ్య భారీగా పెరిగింది. అది ఏ స్ధాయిలో ఉందంటే మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఉద్యోగాలు ఏకంగా 38 శాతం పెరిగాయని ప్రముఖ ఉద్యోగాల సెర్చింగ్ వెబ్ సైట్ నౌకరీ డాట్ కామ్ తన నివేదికలో వెల్లడించింది.

దీనికి భిన్నంగా ఏఐ కాకుండా మిగిలిన టెక్ ఉద్యోగాలు కేవలం ఎనిమిది శాతం మాత్రమే పెరిగాయని నౌకరీ డాట్ కామ్ తెలిపింది. ఏఐ ఉద్యోగాల నియామకాల్లో ఎక్కువ భాగం (53 శాతం) ఐటీ రంగంలో ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ రంగంలో ఏఐ ఉద్యోగాల కోసం ఖాళీలు కూడా 48 శాతం పెరిగాయని ఈ నివేదిక తెలిపింది. అలాగే ఐటీ ఆధారిత సేవలు, బీపీఓ రంగాల్లోనూ గత సంవత్సరంతో పోలిస్తే 39 శాతం ఉద్యోగాలు పెరిగాయని వెల్లడించింది. అకౌంటింగ్ వంటి ఇతర రంగాల్లో జరుగుతున్న నియామకాల్లో సైతం 49 శాతం వృద్ధి నమోదైనట్లు ఈ నివేదిక పేర్కొంది.












Click it and Unblock the Notifications