ఏఐ మా ఉద్యోగాల్ని ఎన్నేళ్లలో మింగేస్తుందంటే ? 74శాతం ప్రొఫెషనల్స్ మాట ఇదే.. !

కృత్రిమ మేథ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓవైపు సాధారణ ప్రజల జీవనాన్ని సులభతరం చేసేస్తూ, మరోవైపు వారి ఉద్యోగాలకు ముప్పు తెస్తూ దూసుకుపోతోంది. దీని ప్రభావం అన్ని దేశాల్లోనూ కనిపిస్తోంది. కరోనా సమయంలో ఎలాగైతే ఇన్నాళ్లూ ఓ లెక్క.. ఇప్పటి నుంచి ఓ లెక్క అనుకున్నామో.. ఇప్పుడు ఏఐ విషయంలోనూ అలాగే అనుకోవాల్సిన పరిస్దితి ఉద్యోగులకు వచ్చేస్తోంది. దీంతో పలు దేశాల్లో ఏఐ దూకుడుతో ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు.

ఏఐ రాకతో తమ ఉద్యోగాలు ఎన్నేళ్లలో పోతాయని ఓ సర్వేలో అమెరికన్లను ప్రశ్నిస్తే ఏకంగా 74 శాతం మంది మూడేళ్లలో అని తడుముకోకుండా సమాధానం ఇచ్చేశారంటే కృత్రిమ మేథ దూకుడు ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. బ్లైండ్ అనే నెట్ వర్క్ నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న ప్రొఫెషనల్స్ లో 74 శాతం మరో మూడేళ్లలో ఏఐ తమ ఉద్యోగాలను భర్తీ చేసేస్తుందని స్పష్టంగా చెప్పేశారు. మరో 26 శాతం మంది మాత్రం ఏఐ వచ్చినా తమ ఉద్యోగాలకు ఢోకా లేదని వెల్లడించారు.

AI can replace their jobs in three years 74 percent Americans say in latest survey

అమెరికాలోని అత్యంత వెరిఫైడ్ ప్రొఫెషనల్స్ పై నిర్వహించిన ఈ సర్వేలో 3500 మంది ఏఐ రాకతో తమ ఉద్యోగాలపై పడే ప్రభావంపై అభిప్రాయాలను వెల్లడించారు. వాస్తవానికి ఈ సర్వే అమెరికన్ ప్రొఫెషనల్స్ పై చేసినా వారు చెప్పిన సమాధానాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్దితికి అద్ధం పట్టేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇదే సర్వేలో 16 ఏళ్లకు పైగా ప్రొఫెషనల్ అనుభవం ఉన్న నిపుణులు సైతం ఏఐ తమ ఉద్యోగాలను రెండు, మూడేళ్లలో భర్తీ చేయడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Take a Poll

వీరితో పోలిస్తే తక్కువ అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ ఏఐ వల్ల తమ ఉద్యోగాలు పోతాయని భావించే కాలాన్ని ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఇందులో 2 ఏళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న నిపుణులు.. ఏఐ వారి పాత్రలను భర్తీ చేయడానికి 3 సంవత్సరాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా ఏ విధంగా చూసినా రెండు, మూడేళ్లలో మాత్రం ఏఐ తమ ఉద్యోగాలను లాగేసుకుటుందనే అభిప్రాయంతోనే 74 శాతం మంది ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+