AI తో ఏం పనులురా ఇవి..?

మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని లక్షలాది మంది యవతీయువకులు ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. రూ. లక్షల్లో ప్యాకేజీలను దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తున్న నేపథ్యంలో పిల్లలకు స్కూల్ స్టేజీ నుంచి ఏఐ ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. ఏఐను అందిపుచ్చుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటిది కొందరు మాత్రం ఏఐ ను ఉపయోగించుకుంటూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సైతం ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ ఐటీ విద్యార్థి ఏఐను ఉపయోగించి సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు.

ఛత్తీస్ ఘడ్ కు చెందిన ఓ ఐటీ విద్యార్థి ఏఐ టెక్నాలజీని చెడు పనులకు వినియోగించుకున్నాడు. చివరికి కటకటాల పాలై నిండు జీవితాన్ని బలి చేసుకున్నాడు. కాలేజీలో తన తోటి విద్యార్థినుల ఫోటోలను ఏఐతో మార్ఫింగ్ చేసి పోర్న్ చిత్రాలుగా, న్యూడ్ ఫోటోలుగా మార్చాడు. తాజాగా విద్యార్థినులు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఆ స్టూడెంట్‌ ను అధికారులు కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్ పుర్ లో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

AI Deepfake Horror Chhattisgarh IT Student Morphs Female Classmates Photos into Nude Nightmares

బిలాస్‌ పూర్‌ చెందిన ఓ స్టూడెంట్ నయా రాయ్‌ పూర్‌ లోని ఇంటర్నేషనల్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ECE మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే కాలేజీలో 30 మంది మహిళా విద్యార్థుల పోర్న్ చిత్రాలను, మార్ఫింగ్ ఫొటోలను ఏఐ సాయంతో క్రియేట్ చేశాడు. ఇటీవల ఇదే విషయంపై పలువురు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో అధికారులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+