AI Jobs: భారత్ లో ఏఐ ఉద్యోగాలకు భారీ డిమాండ్..! ఈ లెక్కలే సాక్ష్యం..!

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ దూకుడు కనిపిస్తోంది. భారత్ లోనూ పరిస్ధితి భిన్నంగా ఏమీ లేదు. ఇప్పటికే ఎన్నో సంస్థలు ఏఐ, ఆటోమేషన్ ను అమల్లోకి తెచ్చి ఉద్యోగాల కోతలు విధిస్తున్నాయి. తద్వారా లాభాల్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే అదే సమయంలో ఏఐ ఉద్యోగాల డిమాండ్ కూడా అంతే స్పీడుగా పెరుగుతోందని తాజా నివేదిక వెల్లడించింది.

భారత్ లో ఏఐ ఉద్యోగాలకు ఇప్పుడు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా గత త్రైమాసికంలో పలు కంపెనీలు ఏఐ నైపుణ్యాలు లేని ఉద్యోగులను సాగనంపడం ప్రారంభించాక కొత్తగా ఇవే స్కిల్స్ ఉన్న ఉద్యోగులను నియమించుకోవడం కూడా ప్రారంభించాయి. దీంతో పాటు పలు స్టార్టప్ కంపెనీలు సైతం ఏఐ నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల వైపే చూస్తున్నాయి. దీంతో ఏఐ ఉద్యోగాల డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఒక్క సెప్టెంబర్ లోనే ఏఐ ఉద్యోగాల డిమాండ్ 11.7 శాతం పెరిగిందని తాజా గ్లోబల్ నియామకాల ప్లాట్ ఫామ్ ఇండీడ్ నివేదిక వెల్లడించింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో 8.2 శాతంగా ఉందని వెల్లడించింది.

AI Hiring Surges India Sees 11 7 of Job Postings Linked to Artificial Intelligence in September

సెప్టెంబర్‌ నెలలో 11.7 శాతం భారతీయ ఉద్యోగ నియామకాలు తమ ఉద్యోగ ప్రకటనల్లో ఏఐని స్పష్టంగా ప్రస్తావించాయి. ఇది మూడు నెలల క్రితం 10.6 శాతంగా, గతేడాది ఇదే సమయంలో 8.2 శాతంగా ఉందని ఇండీడ్ రిపోర్ట్ తెలిపింది. అలాగే భారతదేశం ఇతర ఇండీడ్ మార్కెట్లతో పోలిస్తే టాప్ లో ఉంది. భారత్ కాకుండా కృత్రిమ మేధస్సును ప్రస్తావించే పోస్టింగ్‌లలో సింగపూర్ మాత్రమే మెరుగ్గా ఉంది. దేశవ్యాప్తంగా చాలా సంస్థలు కృత్రిమ మేధస్సుపై పూర్తిగా దృష్టి సారించారని స్పష్టంగా తెలుస్తుందని ఇండీడ్ రిపోర్ట్ పేర్కొంది.

AI Hiring Surges India Sees 11 7 of Job Postings Linked to Artificial Intelligence in September

ఈ నివేదికలోని ఫలితాలు భారతదేశ అధికారిక ఆర్థిక వ్యవస్థ అంతటా రియల్-టైమ్ నియామక కార్యకలాపాలను ట్రాక్ చేసే ఇండీడ్ ప్లాట్‌ఫామ్‌లోని ఉద్యోగ పోస్టింగ్ డేటా ఆధారంగా ఉన్నాయి. గత నెలలు, సంవత్సరం వారీగా రెండు స్థాయిలతో పోల్చి సెప్టెంబర్ 2025 నాటికి ఉద్యోగ పోస్టింగ్ ట్రెండ్‌లను కొలిస్తే ఈ ఫలితాలు లభించాయి. మరోవైపు ఏఐ సంబంధిత అవకాశాలు టెక్ రంగంలో కేంద్రీకృతమై ఉన్నాయని, కానీ అవి విస్తృతంగా పెరుగుతున్నాయని ఈ నివేదిక వెల్లడించింది.

టెక్ రంగంలో పెరిగిన ఏఐ ఉద్యోగాల్లో దాదాపు 39 శాతం డేటా, అనలిటిక్స్ ఉద్యోగాలు ఏఐని ప్రస్తావించాయని, సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ (23 శాతం), ఇన్సూరెన్స్ (18 శాతం), శాస్త్రీయ పరిశోధన (17 శాతం) పారిశ్రామిక ఇంజనీరింగ్ (17 శాతం), మెకానికల్ ఇంజనీరింగ్ (11 శాతం), ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (9.2 శాతం) కంటే ఇవి ముందున్నాయని ఈ నివేదిక తెలిపింది. అలాగే అనేక ఇంజనీరింగ్ బ్రాంచ్ లలో ఏఐ నైపుణ్యాల డిమాండ్ సాధారణంగా ఉంది. మరోవైపు సెప్టెంబర్‌లో భారతీయ ఉద్యోగ నియామకాలు 0.8 శాతం తగ్గాయి. ఇది వరుసగా ఆరవ నెల క్షీణతగా అంచనా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+