'ఇనుములో హృదయం మొలిచెనే'.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..!
ప్రస్తుత పరిస్థితుల్లో మానవ సంబంధాలు సంక్లిష్టంగా మారాయి. ప్రేమతోపాటు సవాళ్లు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలికాలంలో కొత్తరకం బాండింగ్ ఒకటి పుట్టుకొచ్చింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మనుషుల మధ్య కుదిరింది. ఈ కాన్సెప్ట్ గతంలో సైన్స్ ఫిక్షన్ పరిధి వరకే ఉండగా.. ఇప్పడు ఏఐ లక్షలాది మంది డెయిలీ లైఫ్ లో భాగంగా మారింది. ఇది ఓ టూల్ మాదిరి కాకుండా ఓ సగటు మనిషిలానే సాయపడుతోంది. ఇటీవల వాంటేజ్ పాయింట్ కౌన్సెలింగ్ సర్వీసెస్ అనే సంస్థ ఓ రీసెర్చ్ చేపట్టింది. వేయి మందికిపైగా అమెరికాలోని యువతపై పరీక్షలు నిర్వహించింది. అయితే ఇందులో 28 శాతం మంది ఏఐతో సాన్నిహిత్యం, రొమాంటిక్ రిలేషన్ ఏర్పరచుకున్నారు.
ఈ క్రమంలో ఏఐ తన పరిధిని దాటి విస్తరిస్తోంది. కేవలం ఏఐ టూల్స్ లేదా వాయిస్ అసిస్టెంట్ మాత్రమే కాకుండా ప్రజల జీవితంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఓ బిజినెస్ సహచర ఉద్యోగి నుంచి రొమాంటిక్ పార్ట్నర్ గా వివిధ దశల్లో ఏఐ తన సహకారాన్ని ప్రజలకు అందిస్తోంది. తాజాగా నిర్వహించిన సర్వేలో ఏఐతో కేవలం ఒంటరిగా ఉన్న యువత మాత్రమే సాన్నిహిత్యం పెట్టుకోవట్లేదని.. ఇదివరకే విజయవంతంగా రిలేషన్ షిప్ లో ఉన్న జంటలు కూడా ఏఐతో సాన్నిహిత్యం ప్రదర్శించినట్లు తేలింది.
ఈ సర్వే తర్వాత ఏఐ మానవ రిలేషన్స్ లో మున్ముందు కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. 53 శాతం మంది అడల్ట్స్ ఏఐతో మానవులతో మాదిరిగానే ఏఐతో సాన్నిహిత్యంతో ఉన్నట్లు వెల్లడైంది. వీరిలో కొంతమంది యువత ఏఐ చీటింగ్ అని అభిప్రాయపడింది. మరికొంతమంది చీటింగ్ కాదని స్పష్టం చేసింది. అలాగే 60 ఏళ్ల పైబడిన వ్యక్తులు ఏఐ తో రిలేషన్ ప్రమాదం కాదని చెప్పడం గమనార్హం. అయితే చాలా మందికి ఈ రిలేషన్.. సంప్రదాయ రిలేషన్ మాదిరి కాదని స్పష్టం అవుతోంది.

తాను ఏఐతో సెక్సువల్ చాటింగ్ చేశానని.. అంతమాత్రాన అది రొమాంటిక్ రిలేషన్ కాదని ఓ వ్యక్తి స్పందించాడు. అయితే ఏఐతో రిలేషన్ తో సాధారణంగా మానవ శరీరంలో డోపమైన్ హార్మోన్ రిలీజ్.. ఎమోషనల్ గా ఫుల్ ఫిల్ అవుతామని.. కానీ అదే పనిగా ఏఐతో ఎంగేజ్ కావడం ద్వారా సమాజానికి దూరంగా వెళ్లడం అలాగే మానసిక అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications