AI: ఏఐ లేకుంటే ఉద్యోగుల భవిష్యత్ లేదా - జాబ్ నిలబడాలంటే..!!
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రంగంలోనూ ప్రవేశిస్తోంది. మొత్తం ప్రపంచాన్నే మార్చేస్తోంది. టెక్నాలజీ పరంగా కొత్త శకం ఈ ఏఐ ద్వారా మొదలైంది. కీలక రంగాల్లో శాసించే స్థాయికి ఎదగింది. సేవా రంగాలతో పాటుగా విద్య.. ఉపాధికి సంబంధించి కొత్త ఆవిష్కరణ లతో దూసుకుపోతోంది. ఏఐ లేకపోతే భవిష్యత్ లేదనే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. ఇక, ఉద్యోగాల పైన ఏఐ సునామీలా విరుచుకుపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి.. భవిష్యత్ ఎలా కాపాడుకోవాలి..
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్. ఇప్పడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ప్రముఖ టెక్ కంపెనీల్లోనూ ఈ ఏఐ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. భారీ స్థాయిలో ఉపాధి కల్పించిన వ్యవస్థల్లో ఏఐ సునామీలా మారుతోంది. రానున్న రెండేండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి మార్కెట్ స్వరూపా న్నే సమూలంగా మార్చేస్తుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాల పైన ఏఐ ప్రభావం చూపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఏఐ రానున్న రోజుల్లో మరిం త సమర్ధవంతంగా సేవా.. మార్కెటింగ్ రంగాల్లో చొచ్చుకు రావటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ప్రధాన యూనివర్సిటీలు సైతం భవిష్యత్ కు అవసరమైన విధంగా ఏఐ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ తోనే భవిష్యత్ అని డిసైడ్ అయిన వారు ఆ కోర్సుల్లో చేరుతున్నారు.

ఏఐ సంస్థలు కొత్త ఆవిష్కరణలతో దూసుకు వెళ్తున్నాయి. తయారీ రంగం నుంచి మార్కెటింగ్ వరకు ఏఐ పరిధి విస్తరించింది. ఇప్పటికే ఉద్యోగాలు చేసుకుంటున్న వారితో పాటుగా యువత కు ఇప్పుడు ఏఐ ఆధారిత నాలెడ్జ్ తప్పని సరిగా మారుతోంది. భారత్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏఐ ఆధారిత సేవలను పెంచేందుకు ప్రభుత్వాలు సమాయత్తం అవుతున్నాయి. తాజాగా టోనీ బ్లెయిర్ తో ఏపీలో విద్య రంగంలో ఏఐ టూల్స్ వినియోగం కోసం ఏపీ ప్రభుత్వం అవ గాహన ఒప్పందం చేసుకుంది. అమరావతి కేంద్రంగా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రధాన కాలేజీల్లో ఏఐ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. మారుతున్న కాలనికి అనుగుణంగా.. ఇప్పుడు ఏఐ యుగంలో రాణించేలా సమాయత్తం కావాల్సిందేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు. దీంతో, రానున్న రోజుల్లో ఉద్యోగం కావాలంటే.. ఏఐ తప్పనిసరి గా మారటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications