దయాదాక్షిణ్యాల్లేవ్- ఒక్క దెబ్బకు 30,000 మంది ఉద్యోగులు అవుట్

ప్రఖ్యాత ఇ- కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్.. లేఆఫ్స్ ప్రకటించింది. ఏకంగా 30,000 మందిని తొలగించనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ నేటి నుంచే ఆరంభం కానున్నట్లు వార్తలు వస్తోన్నాయి. ఖర్చుల నియంత్రణ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకుంటోన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థను పునర్వ్యవస్థీకరించనుంది. ఇదివరకే హెచ్‌ఆర్ విభాగంలోని దాదాపు 15 శాతం మంది ఉద్యోగులను తొలగించనునట్లు ప్రకటించింది అమెజాన్. తాజాగా మరో విడత లేఆఫ్స్ కు తెర తీసింది.

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ లో అన్ని విభాగాల్లో పని చేస్తోన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.55 మిలియన్. దీంతో పోల్చుకుంటే 30,000 మంది తొలగింపు చిన్న శాతం అయినప్పటికీ.. కార్పొరేట్, మేనేజర్ స్థాయిలో దాదాపు 3,50,000 ఉద్యోగులపై దీని ప్రభావం పడుతుందని అంటున్నారు. అమెజాన్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో కార్పొరేట్ ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది ప్రభావితం కానున్నారు. దీనిపై రాయిటర్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

Amazon Reportedly Plans Massive Layoffs to cut 30000 Jobs

2022 చివరి నుంచి 27,000 ఉద్యోగాలను తొలగిస్తూ వచ్చింది అమెజాన్ మేనేజ్మెంట్. దీని తర్వాత ఆ స్థాయిలో మరోసారి ఉద్యోగాలకు కోత పెట్టడం ఇదే తొలిసారి అవుతుంది. ఈ వార్త వెలువడిన తర్వాత కూడా అమెజాన్ షేర్లు భారీగా లాభపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కిందటి రోజు క్లోజింగ్ బెల్ తో పోల్చుకుంటే 1.5 శాతం పెరిగి 227.53 డాలర్లకు చేరుకున్నాయి. కంపెనీ తన మూడో త్రైమాసిక ఆదాయ ఫలితాలను గురువారం ప్రకటించనుంది.

రెండు సంవత్సరాలుగా అమెజాన్.. డివైసెస్, కమ్యూనికేషన్స్, పాడ్‌కాస్టింగ్ వంటి పలు విభాగాల్లో చిన్న సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తూ వచ్చింది. ఇప్పుడు పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ, డివైసెస్ అండ్ సర్వీసెస్, ఆపరేషన్స్‌తో సహా అనేక విభాగాల్లో కోత పెట్టనుంది. ఆయా విభాగాల టీమ్‌ మేనేజర్లకు మంగళవారం ఉదయం నుండి ఇమెయిల్ నోటిఫికేషన్లు పంపిస్తుందని, దీని తర్వాత లేఆఫ్ ఎదుర్కొంటోన్న సిబ్బందికి ఈ విషయాన్ని ఎలా తెలియజేయాలనే విషయాన్ని వివరిస్తుందని రాయిటర్స్ తెలిపింది.

ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వైపు అమెజాన్ మొగ్గు చూపుతున్నందున అంచనాలకు మించి లేఆఫ్స్ ఉంటాయని ఫార్చూన్ అంచనావేసింది. AI పై ఆధారపడటం వల్ల మానవ వనరులను తగ్గించుకుంటోంది అమెజాన్. దీంతో పాటు క్లౌడ్ కార్యకలాపాల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఎంటర్‌ప్రైజ్ క్లయింట్‌ల కోసం AI మౌలిక సదుపాయాలకు మరింత ఊపు ఇచ్చేలా డేటా కేంద్రాలను నిర్మించడానికి అమెజాన్ ఈ సంవత్సరం మూలధన పెట్టుబడిపై 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+