ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో బిగ్ బ్రేక్ త్రూ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఆంథ్రోపిక్ సంస్థ మరోసారి సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఆంథ్రోపిక్ తమ AI మోడల్‌లో సైబర్‌ సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన క్లాడ్ కోడ్ సెక్యూరిటీని విడుదల చేసింది. ఈ అనూహ్య పరిణామం క్రౌడ్‌స్ట్రైక్, క్లౌడ్‌ఫ్లేర్ వంటి ప్రధాన సైబర్‌ సెక్యూరిటీ సంస్థల స్టాక్‌లు పడిపోవడానికి దారితీసింది. క్లాడ్ కోవర్క్ తో సాస్ (SaaS) సంస్థలలో ప్రకంపనలు సృష్టించిన కొద్ది వారాలకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన ఈ కొత్త అప్‌డేట్ క్లాడ్‌కు సైబర్‌సెక్యూరిటీ సామర్థ్యాలను మరింత మెరుగుపర్చుతుంది. ఇది సాంప్రదాయ సైబర్‌ సెక్యూరిటీ సంస్థలకు పెద్ద దెబ్బ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ లోపాలను గుర్తించడానికి, వాటిని అప్పటికప్పుడు పరిష్కరించడానికి సహాయపడే AI- పవర్డ్ టూల్‌గా క్లాడ్ కోడ్ సెక్యూరిటీని ఆంథ్రోపిక్ అభివర్ణించింది. ఇది ప్రస్తుతానికి ప్రయోగ దశలో ఉన్నప్పటికీ ఇది సైబర్‌సెక్యూరిటీ సంస్థల సేవలను తప్పనిసరి చేయగలదని ఊహాగానాలు వినిపిస్తోన్నాయి.

Anthropic Unveils Claude Code Security AI-Powered Vulnerability Scanning with Patch Suggestions

క్లాడ్ కోడ్ సెక్యూరిటీ విడుదల అనంతరం టాప్ సైబర్‌ సెక్యూరిటీ సంస్థల స్టాక్స్ గణనీయంగా పడిపోయాయి. క్రౌడ్‌స్ట్రైక్ హోల్డింగ్స్ 6.5, క్లౌడ్‌ఫ్లేర్ 6, జెడ్‌స్కలర్ 3.5, సెయిల్‌పాయింట్ 6.8 శాతం ఓక్టా షేర్లు 5.7 శాతం మేర నష్టాలను చవిచూశాయి. సైబర్‌ సెక్యూరిటీ టెక్నాలజీ అభివృద్ధి నుండి ప్రయోజనం పొందే కంపెనీలలో పెట్టుబడి పెట్టే గ్లోబల్ ఎక్స్ సైబర్‌సెక్యూరిటీ ఈటీఎఫ్ (ETF) కూడా 3.8 శాతం పడిపోయింది. ఈ సంవత్సరంలో ఇది 14 శాతం పతనానికి చేరుకుంది.

ఓపెన్‌ఏఐ, ఆల్ఫాబెట్ వంటి కంపెనీల నుండి కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను విస్తారంగా డెవలప్ చేస్తోన్న నేపథ్యంలో ఆంథ్రోపిక్ తాజాగా క్లాడ్ కోడ్ సెక్యూరిటీని విడుదల చేసింది. ఆంథ్రోపిక్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కొత్త ఫీచర్ కోడ్‌బేస్‌లను సెక్యూరిటీ లోపాలను స్కాన్ చేయడంతో పాటు ఇందులోని సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌లను గుర్తిస్తుంది. తలో లోపాలను సరిదిద్దుకోవడానికి, మరింత పునరుద్ధరించుకోవడానికి అవసరమైన సిఫారసులను సూచిస్తుంది.

సాధారణ సైబర్‌ సెక్యూరిటీ టూల్స్ లోపాలను మాత్రమే గుర్తించి, వాటిని రివ్యూ కోసం పంపిస్తాయి. ఆంథ్రోపిక్ సూచించే పరిష్కారాలు దీనికి భిన్నంగా ఉంటాయి. క్లాడ్ కోడ్ సెక్యూరిటీ లోపాలను కనుగొనడంతో పాటు ప్యాచ్‌లను కూడా అందిస్తుంది. తద్వారా లోపాలను గుర్తించడం నుండి పరిష్కరించడం వరకు మొత్తం వర్క్‌ఫ్లోను ఒకేసారి పూర్తి చేస్తుంది. ఇది ఆయా సంస్థలకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా భారీ ఖర్చులను తగ్గించగలదు. భవిష్యత్తులో క్రౌడ్‌స్ట్రైక్ వంటి సైబర్‌సెక్యూరిటీ సంస్థల సేవలు అవసరం ఉండకపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+