AI తో నిండు నూరేళ్లు జీవించే ఛాన్స్ - వచ్చే ఐదేళ్లలోనే..!!
మానవ జీవితకాలం రెట్టింపు సాధ్యమేనా. జీవిత కాలాల్ని మరింత పెంచే శక్తి ఉందా. ఇప్పుడు వీటికి ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ తో సాధ్యమేననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏఐ ద్వారా వచ్చే అయిదేళ్లు కాలంలో మానవ జీవితకాలం రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. 150 ఏళ్లకు జీవించే విధంగా మార్పులు చేయవచ్చని చెబుతున్నా.. వందేళ్లు మాత్రం ఖాయమనే గట్టిగా చెబుతున్నారు. అయితే, ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ తో అసలు జీవితకాలం ఎలా రెట్టింపు అవుతుంది అనేది అసలు సందేహం. దీనికి ఏఐ పరిశోధకుల నుంచి ఆశ్చర్యకర సమాధానాలు వస్తున్నాయి.
ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ కు వేలాది పత్రాలను సైతం వేగంగా పరిశీలించి క్షణాల్లో విశ్లేషించే శక్తి ఏఐకి ఉందని శాస్త్రజ్ఞులు గుర్తుచేస్తున్నారు. ఆ శక్తిని వినియోగించుకోవడం ద్వారా.. సరైన చికిత్స లేని పలు ఆరోగ్య సమస్యలకు కొత్త కొత్త పరిష్కారాలను కనుగొనవచ్చని, కొన్ని సమస్యలు అసలు తలెత్తకుండా ముందుజాగ్రత్త పడొచ్చని తద్వారా మనుషుల లైఫ్‌స్పాన్‌ను పెంచడం సాధ్యమని విశ్లేషిస్తున్నారు. ఏఐ సాయంతో మానవ జీవితకాలాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయొచ్చని.. అమెరికాలోని క్యాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ వ్యవస్థాపకుడు డేరియో పదేపదే చెబుతున్నారు. మరో నిపుణుడు.. రే కర్జ్‌వెయిల్‌ది కూడా ఇదే మాట. మానవుల్లో వయసు మీరే ప్రక్రియను 2032 నాటికి ఏఐ నియంత్రించగలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

2032 నాటికి కృత్రిమమేధతో పనిచేసే మెడికల్ నానోబోట్లు అందుబాటులోకి వస్తాయని, మనకు ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏఐ సాయంతో సమస్య ఏమిటో గుర్తించి.. ఈ మెడికల్ నానోబోట్లను శరీరంలోకి పంపిస్తే అవి కణ స్థాయిలో మరమ్మతులు చేస్తాయని చెప్పుకొచ్చారు. ఏఐ సాయంతో అప్పటికి మన మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీయడం కూడా సాధ్యమవుతుందని ఆయన అంచనా.
అలా బ్యాకప్ తీయగలిగితే మనిషి భౌతికంగా లేకపోయినా మానసికంగా చిరంజీవిగానే ఉంటారనే ఆసక్తి కర విశ్లేషణ చేస్తున్నారు. ఏఐ ద్వారా సినిమాల తరహాలో అన్నీ ఒకేసారి మార్పు చేయలేమని.. అయితే, మరింత ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచగలుగుతుంది. మరీ 150 ఏళ్లు కాదుగానీ.. ఏఐ మనుషులు కనీసం వందేళ్లు జీవించడం మన జీవితకాలంలోనే చూడగలుగుతామ ని నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications