5 గంటల్లోపే AI ఎక్స్‌పర్ట్‌గా మారండి: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం
భారత ప్రభుత్వం 'యువ AI ఫర్ ఆల్' (Yuva AI For All) అనే ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సును ఎవరైనా చేయవచ్చు. ప్రతి భారతీయుడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రాథమిక సమాచారాన్ని అందించడమే దీని కీలక ఉద్దేశం. పెరుగుతున్న ఏఐ క్రేజ్, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 'యువ AI ఫర్ ఆల్' అనే వినూత్న జాతీయ కోర్సును ప్రారంభించింది.
AI పరిజ్ఞాన లక్ష్యం: ఒక కోటి మందికి శిక్షణ!
ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం చాలా పెద్దది. ప్రభుత్వం ఈ కోర్సు ద్వారా ఒక కోటి మంది భారతీయ పౌరులకు AI నైపుణ్యాలను, దాని వినియోగం గురించి పూర్తి సమాచారాన్ని ఉచితంగా అందించాలని సంకల్పించింది. ఈ కోర్సు అతి చిన్నది, కేవలం 4.5 గంటల్లో పూర్తి చేయవచ్చు. అంటే, ఎక్కువ సమయాన్ని కేటాయించకుండానే కేవలం ఒక్క రోజులో ఏఐ గురించి ప్రాథమిక అవగాహన పొందవచ్చు.ఈ కోర్సును చేయాలంటే మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి భారత ప్రభుత్వం తరపున అధికారిక సర్టిఫికెట్ కూడా లభిస్తుంది.

కోర్సు ఎక్కడ అందుబాటులో ఉంది?
కేంద్ర ప్రభుత్వ ఇండియాఏఐ (IndiaAI) మిషన్లో భాగంగా రూపొందించబడిన ఈ కోర్సు, ప్రముఖ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు, నిపుణులు, చిన్న వ్యాపార యజమానులు, ఇతర పౌరులు AI ప్రాథమిక అంశాలు నేర్చుకోవచ్చు. ఈ కోర్సు FutureSkills Prime, iGOT Karmayogi, ఇతర ప్రముఖ ఎడ్-టెక్ పోర్టల్స్ వంటి ప్రధాన లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ కోర్సును ప్రఖ్యాత AI నిపుణుడు, రచయిత, AI అండ్ బియాండ్, టెక్ విస్పెర్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు అయిన జస్‌ప్రీత్ బింద్రా రూపొందించారు.
6 చిన్న మాడ్యూల్స్‌లో ఏం నేర్పుతారు?
AI ప్రపంచాన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు ఈ కోర్సును 6 చిన్న మాడ్యూల్స్‌గా విభజించారు. వీటిలో ముఖ్యంగా నేర్పించే అంశాలు:
*AI అంటే ఏమిటి?: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరళమైన నిర్వచనం, అది ఎలా పనిచేస్తుంది అనే ప్రాథమిక సూత్రాలను నేర్పిస్తారు.
*AI ప్రభావం: AI అనేది విద్య, క్రియేటివిటీ, వృత్తిపరమైన పనితీరును ఏ విధంగా మారుస్తోంది, భవిష్యత్తులో అది ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలపై అవగాహన కల్పిస్తారు.
*బాధ్యతాయుత వినియోగం: AI సాధనాలను సురక్షితంగా, నైతికంగా, బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలి అనేదానిపై గైడెన్స్ ఇస్తారు.
*భవిష్యత్తు అవకాశాలు: AI రంగంలో రాబోయే ట్రెండ్‌లు, యువతకు అందుబాటులో ఉండే కొత్త అవకాశాల గురించి అవగాహన కల్పిస్తారు.
*లక్ష్యం: ఈ ఉచిత, తక్కువ-వ్యవధి కోర్సును పూర్తి చేయడం ద్వారా భారతీయ పౌరులు AI గురించి ప్రాథమిక అవగాహన పెంచుకోవచ్చు, తద్వారా రాబోయే టెక్నాలజీ యుగానికి సిద్ధమవుతారు.












Click it and Unblock the Notifications