సోషల్ మీడియా "కంటెంట్ క్రియేటర్స్" కోసం బెస్ట్ AI టూల్స్ ఇవే..!
ప్రస్తుతం సోషల్ మీడియా జమానా నడుస్తోంది. అలానే అందుకు తగ్గట్టు కంటెంట్ క్రియేటర్ల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. కొందరి రీల్స్ చేస్తుంటారు, ఇంకొందరు పోస్టర్స్ డిజైన్ చేస్తుంటారు, మరికొందరు టెక్స్ట్ రాస్తుంటారు. ఇలా ప్రతి ఒక్కరూ పని వేరు అయినా.. కానీ కంటెంట్ ఏదైనా దానికోసం కొన్ని ఏఐ టూల్స్ రెడీగా ఉన్నాయి. ఇవి కంటెంట్ క్రియేషన్ ను మరింత సులభతరం చేసి సమయాన్ని సేవ్ చేస్తాయి.
మారుతున్న కాలానుగుణంగా కంటెంట్ క్రియేటర్స్‌కి AI టూల్స్ నిజమైన అసిస్టెంట్స్ లా మారాయి. టెక్స్ట్, వీడియో, ఆడియో, డిజైనింగ్ ఏదైనా కావాలి అంటే.. దానికి సరిపడే AI టూల్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. సరైన టూల్ ఎంచుకుంటే కంటెంట్ క్వాలిటీతో పాటు ప్రొడక్షన్ టైమ్ కూడా గణనీయంగా తగ్గుతుంది. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

టాప్ 10 AI టూల్స్..
వీడియో & ప్రెజెంటేషన్ టూల్స్..
- Veed.io - స్క్రిప్ట్ అప్‌లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా వీడియోలు రెడీ అవుతాయి. అవతార్స్‌తో కూడా వీడియో జనరేట్ చేయవచ్చు.
- Guidde.com - "హౌ టు" గైడ్స్, బిజినెస్ ప్రెజెంటేషన్స్ కోసం బెటర్. స్క్రీన్ రికార్డింగ్, టెక్స్ట్ టు వాయిస్ ఓవర్ సపోర్ట్ ఉంటుంది.
- Pictory - లాంగ్ వీడియోలని చిన్న చిన్న క్లిప్స్‌గా మార్చే టూల్. యూట్యూబ్/ఇన్‌స్టా రీల్స్‌కి ఉపయోగపడుతుంది.
డిజైన్ & ఇమేజ్ జనరేషన్..
- Adobe Firefly - కాన్సెప్ట్ పోస్టర్లు, వెక్టార్ గ్రాఫిక్స్, రకరకాల డిజైన్‌లను క్రియేట్ చేయడానికి.
- Canva AI - రెడీ టెంప్లేట్స్‌తో పోస్టర్లు, సోషల్ మీడియా క్రియేటివ్స్ డిజైన్ చేయడానికి.
టెక్స్ట్ & ఐడియాస్..
- ChatGPT - ఆర్టికల్స్, షార్ట్ ఫిల్మ్ ఐడియాస్, యూట్యూబ్ టైటిల్స్, స్క్రిప్ట్స్ మొదలైన వాటికి.
- Jasper AI - మార్కెటింగ్ కాపీస్, బ్లాగ్ పోస్ట్స్, అడ్వర్టైజ్‌మెంట్ కంటెంట్ కోసం స్పెషలైజ్‌డ్ టూల్.
మ్యూజిక్ & ఆడియో..
- BeatOven - కాపీరైట్ లేని ఒరిజినల్ మ్యూజిక్ ట్రాక్స్‌ను జనరేట్ చేయడానికి.
- Murf.ai - టెక్స్ట్‌ను నేచురల్ వాయిస్ ఓవర్‌గా మార్చే AI టూల్. వీడియోలకు ప్రొఫెషనల్ నేరేషన్‌కి పనికొస్తుంది.
అనువాదం & ట్రాన్స్‌క్రిప్షన్..
- DeepL - హై క్వాలిటీ ట్రాన్స్‌లేషన్స్. ఫారిన్ లాంగ్వేజ్ కంటెంట్‌ను లోకల్ లాంగ్వేజ్‌లోకి మార్చుకోవచ్చు.
- VidRapid - ఏ వీడియోలోని కంటెంట్‌ను టెక్స్ట్‌గా ట్రాన్స్‌క్రిప్ట్ చేస్తుంది. అలాగే షార్ట్ కంటెంట్‌గా మార్చే ఆప్షన్ కూడా ఉంటుంది.












Click it and Unblock the Notifications