యూపీఐ పేమెంట్స్ లో కొత్త సిస్టమ్

టెక్ రంగంలో ఓ సంచలనంగా మారిన ఛాట్ జీపీటీతో ఒక యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ కూడా చేయవచ్చు. ఈ సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ దిశగా ఛాట్ జీపీటీ రూపకర్త ఓపెన్‌ఏఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రేజర్‌పే సంయుక్తంగా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. దీని ద్వారా ఛాట్‌జీపీటీ వినియోగించి నేరుగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులు చేయవచ్చు.

దేశంలో రియల్-టైమ్ పేమెంట్స్ నెట్‌వర్క్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కు చెందిన చాట్‌బోట్‌తో అనుసంధానించడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చాట్‌బోట్ ఇంటర్‌ఫేస్ ద్వారానే యూపీఐ యూజర్లు.. తాము కొనుగోలు చేసిన వస్తువులకు ఛాట్ జీపీటీ ద్వారా డిజిటల్ చెల్లింపులు నిర్వహించడానికి వీలు ఉంటుంది. AI టూల్స్ ఆధారంగా జరిపే ఈ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సురక్షితంగా ఉంటాయా? లేదా అనేది OpenAI ఈ పైలట్ ప్రోగ్రామ్‌లో పరీక్షిస్తుంది.

ChatGPT Now Supports UPI Payments as OpenAI has partnered with NPCI and Razorpay

దీన్ని ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టామని, ఇది విజయవంతమైతే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని ఓపెన్ ఏఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వెల్లడించాయి. దీనికోసం రేజర్ పేతో థర్డ్ పార్టీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపాయి. యాక్సిస్ బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ పైలట్‌కు బ్యాంకింగ్ భాగస్వాములుగా చేరాయి. ఈ పైలెట్ ప్రాజెక్ట్ కింద వివిధ రంగాల్లో AI-ఆధారిత చెల్లింపులను ఎలా విస్తరించవచ్చనే విషయాన్ని అంచనా వేస్తారు.

చాట్‌జీపీటీని ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయదగ్గ సంస్థల్లో టాటా గ్రూప్ కు చెందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్‌ బాస్కెట్ ఎంపికైంది. బిగ్ బాస్కెట్ లో షాపింగ్ చేసే ఏ వస్తువుకైనా సరే.. చాట్‌జీపీటీని ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయవచ్చని ఓపెన్‌ఏఐ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ మేనేజింగ్ డైరెక్టర్ ఆలివర్ వెల్లడించారు. ఎన్పీసీఐతో కలిసి పనిచేయడం, అధునాతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను రియల్-టైమ్ చెల్లింపు నెట్‌వర్క్‌లలో ఒకటైన యూపీఐతో అనుసంధానించడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం యూపీఐ ద్వారా ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా లావాదేవీల నమోదవుతున్నాయి. ఓపెన్‌ఏఐ, రేజర్‌పే, ఎన్పీసీఐ మధ్య కుదిరిన ఈ ఒప్పందం, పైలెట్ ప్రాజెక్ట్.. విజయవంతమైతే ఆన్‌లైన్ షాపింగ్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించే విధానానికి శ్రీకారం చుట్టినట్టవుతుంది. డిజిటల్ చెల్లింపులు మరింత రెట్టింపు అవుతాయి. ప్రస్తుతానికి బిగ్ బాస్కెట్ కు మాత్రమే పరిమితమైన ఈ విధానం అన్ని ఇ- కామర్స్ ప్లాట్ ఫామ్స్, షాపింగ్ సెంటర్లు, దుకాణాల్లో అందుబాటులోకి వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+