చైనా ఓ చక్కటి ప్రతిపాదన- భారత్ ఓకే అంటేనే?

పొరుగుదేశం చైనా.. ఓ సరికొత్త ప్రతిపాదనను తెర మీదికి తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీని తామే సృష్టించినట్టుగా అమెరికా చెప్పుకొంటోండటం, దీనికి అనుగుణంగా భారత్ సహా పలు దేశాల ఐటీ నిపుణులకు ఉద్యోగాలు ఇవ్వొద్దంటూ ఆదేశాలు ఇస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదన రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

జీ20, బ్రిక్స్, క్వాడ్.. వంటి అత్యున్నత స్థాయి వేదికల తరహాలోనే గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చైనా ప్రధానమంత్రి లి కియాంగ్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల అన్ని అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఈ రంగంలో పరస్పరం సహకరించుకోగలుగుతాయని అన్నారు.

China propose Global AI cooperation organisation

షాంఘైలో ఏర్పాటైన ప్రపంచ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెమినార్ లో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో చైనా- అమెరికా మధ్య పోటీ తీవ్రతరం కావడం, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సెమినార్ ఏర్పాటు కావడం చర్చనీయాంశమౌతోంది. కృత్రిమ మేధో సంపత్తిని ఆధారంగా చేసుకుని చైనా.. సైనిక సామర్థ్యాలను మరింత పెంచుకోవచ్చనే ఆందోళనల నేపథ్యంలో అమెరికా.. ఏఐ చిప్స్, చిప్ తయారీ పరికరాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

ఈ పరిస్థితుల మధ్య వివిధ దేశాల మధ్య సమన్వయం ప్రతిపాదన చేసింది చైనా. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోందన్న ప్రస్తుత దశలో కొన్ని దేశాలు.. హై-ఎండ్ కంప్యూటింగ్ చిప్‌ల కొరత, టాలెంట్ ఎక్స్ఛేంజ్ పై పరిమితులు వంటి కొన్ని అవరోధాలను ఎదుర్కొంటోన్నాయని లి కియాంగ్ అన్నారు.

స్వేచ్ఛా వాణిజ్యం తరహాలోనే ఈ రంగంలో కూడా కోఆర్డినేటెడ్ ఇన్నోవేషన్ కోసం ఈ అవరోధాలను అధిగమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది.. ఓ కొత్త గ్రోత్ ఇంజిన్ లాంటిదని, దీనికి దారి తెన్నూ ఉండట్లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి దేశాల మధ్య మరింత సమన్వయం అవసరమని లి కియాంగ్ అన్నారు. దీనికోసం వీలైనంత త్వరగా గ్లోబల్ ఏఐ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. AIని తమ హక్కుగా కొన్ని దేశాలు భావించడం సరికాదని తేల్చి చెప్పారు.

వివిధ దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు సంయుక్తంగా ఒకే గొడుగు కిందికి రావాల్సిన అవసరం ఉందని, ఏఐ రంగంలో కలిసి పనిచేయాడానికి ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ ద్వారా మరింత పురోగమించవచ్చని లి కియాంగ్ అన్నారు. క్లీన్ ఎనర్జీ, నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్‌, డేటా సెంటర్‌ల వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలను వేగవంతం చేయాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+