అనారోగ్యకర పోటీపై చైనా తీవ్ర ఆందోళన- దూకుడుకు చెక్ పెడతాం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రపంచ దేశాల మధ్య అనారోగ్యకర, అస్తవ్యస్త పోటీ నెలకొందని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రారంభంలోనే దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, ఆ బాధ్యతలను తాము తీసుకుంటామని ప్రకటించింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలవడానికి అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టనున్నట్లు వెల్లడించింది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వృధా పెట్టుబడులను నివారించాలని తాము కోరుకుంటోన్నట్లు చైనా స్పష్టం చేసింది. ఈ క్రమంలో గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ను సొంతంగా ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొంది.

China said it will prevent excess competition in the artificial intelligence sector

నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ అధికారి ఝాంగ్ కైలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా నిర్వహించిన ఏఐ సమ్మిట్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశం సమగ్రాభివృద్ధి, స్థానిక సంస్థల ప్రయోజనాలు, వనరులు, పారిశ్రామిక పెట్టుబడులు- వాటి అభివృద్ధి అనే పునాదుల ఆధారంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఓ గ్రోత్ ఇంజిన్ గా ఉపకరిస్తుందని, అలాంటి రంగంలో అనవసర, అనారోగ్యకర పోటీ నెలకొనడం ఏ మాత్రం మంచిది కాదని ఝాంగ్ పేర్కొన్నారు. అమెరికా సహా ఇతర దేశాలతో అన్ని రంగాల్లో పోటీ పడటానికి ఏఐని ఓ ప్రధాన వనరుగా గుర్తించామని, ఇది ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తోన్నట్లు తెలిపారు.

ఈ పరిస్థితుల్లో దేశాల మధ్య అనారోగ్యకర పోటీ నెలకొనడం సబబు కాదని పేర్కొన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న ఈ పరిస్థితులను సరిదిద్ది, ప్రపంచ దేశాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ను నెలకొల్పాల్సిన అవసరం ఉందని చెప్పారు.

డీప్‌సీక్ వంటి తమదేశ స్టార్టప్‌లు వేగవంతమైన వృద్ధికి ఒక సంకేతంగా ఉన్నాయని ఝాంగ్ వ్యాఖ్యానించారు. ఈ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో తక్కువ ఖర్చుతో రూపొందించిన AI మోడల్‌ను రూపొందించిందని, దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లబించిందని పేర్కొన్నారు. దేశీయ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని ఇది మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టయిందని అన్నారు.

దేశంలోని పశ్చిమ ప్రాంతాలలో ఉన్న డేటా కేంద్రాలలో 1,15,000 కంటే ఎక్కువ Nvidia AI చిప్‌ల తయారీ కేంద్రాలను నెలకొల్పాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆవిష్కరణల కోసం డార్క్ హార్స్ లను మరింత ప్రోత్సహించాలని ఆకాంక్షిస్తోన్నట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+