తెలంగాణలో అత్యాధునిక AI, VFX స్టూడియో..

తెలంగాణలోకి అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో రాబోతోందా..? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ లో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో అత్యాధునిక AI, VFX స్టూడియోను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని బాలీవుడ్ ప్రముఖ నటుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ విజ్ఞ‌ప్తి చేశారు. దిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న అధికారిక నివాసంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ క‌లిశారు.

హైదరాబాద్ విశ్వ నగరంగా మారేందుకు మరో అడుగు ముందుకు పడింది. హైదరాబాద్ లో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేరకు దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయ‌న అధికారిక నివాసంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ సోమవారం క‌లిశారు.

CM Revanth Reddy Approves Cutting-Edge AI VFX Studio and Sports University in Hyderabad

సీఎంతో భేటీ సందర్భంగా సినీ నిర్మాణంలో కీల‌క‌మైన యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇత‌ర స‌దుపాయాల‌తో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన‌ స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణ‌లో ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ సీఎం రేవంత్ కు విజ్ఞ‌ప్తి చేశారు. అంత‌ర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణంతో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌లో వివిధ విభాగాల‌కు అవ‌స‌ర‌మైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఈ మేరకు అజ‌య్ దేవ‌గ‌ణ్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు.

ఈ క్రమంలో తెలంగాణ అభివృద్దికి తాము తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను, వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి అజయ్ దేవ‌గ‌ణ్‌ కు వివ‌రించారు.
తెలంగాణ రైజింగ్‌ కు సంబంధించి మీడియా, సినిమా రంగాల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా ఉంటాన‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి తెలియ‌జేశారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, కేంద్ర ప‌థ‌కాల స‌మ‌న్వ‌య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ గౌర‌వ్ ఉత్పల్ పాల్గొన్నారు.

మరోవైపు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. హైదరాబాద్‌ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రణాళికలపై చర్చించారు. క్రీడా రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి, యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించడానికి ఈ విశ్వవిద్యాలయం ఎంతగానో దోహదపడుతుందని ఇరువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+