'ఏఐ' అత్యధికంగా వినియోగించే దేశం ఏదో తెలుసా..? భారత్ స్థానం ఇదే..!

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం పెరిగిపోయింది. ఏఐ ప్రతి రంగాన్ని శాసిస్తోంది. మానవ మేథస్సుకు కూడా అంతుచిక్కని అనేక క్లిష్టమైన సమస్యలను ఏఐ క్షణాల్లోనే పరిష్కరిస్తోంది. అనేక సవాళ్లకు సులువైన మార్గాలను చూపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం ఓ సాంకేతికత మాత్రమే కాకుండా ఇంట్లో ఓ భాగంగా.. మానవ దినచర్యలో ఓ భాగంగా మారిపోయింది. అలాగే ప్రపంచ దేశాల ఆర్థిక ప్రగతిని, ఆర్థిక వ్యవస్థలో ఏఐ కీలకంగా మారింది. మరి ఏఐ వినియోగంలో ఏ దేశం టాప్ లో ఉందో తెలుసా..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను వినియోగించడంలో ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ప్రతి రంగంలో ఏఐ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. అయితే ఇటీవల స్టాన్‌ ఫర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ ఓ పరిశోధన చేపట్టింది. ఈ పరిశోధనకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది. ఈ నివేదిక ఆధారంగా ఏఐ వినియోగంలో తొలి స్థానంలో అమెరికా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా ఉంది. ఇక భారత్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏఐ వినియోగం భారత్ లో గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. అయితే పరిశోధన, అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానాలు .. తదితర అనేక కీలక అంశాలను విశ్లేషించి స్టాన్‌ ఫర్డ్ యూనివర్సిటీ ఈ ర్యాంకులను క్రోడీకరించింది.

ఏఐ వినియోగంలో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో నిలవడం శుభపరిణామంగా చెప్పవచ్చు. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది అనడానికి ఈ నివేదిక నిదర్శనంగా చెప్పవచ్చు. ఏఐ వినియోగంలో యూకే, జపాన్, జర్మనీ వంటి దేశాలను భారత్.. అధిగమించడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే.. 2025 లో ఏఐ వినియోగం గణనీయంగా పెరిగింది. అమెరికా ఏఐ అభివృద్ధి, పరిశోధనలో ప్రపంచంలోకెల్లా మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. అమెరికాను ఎలాగైనా అధిగమించాలని చైనా పోటీ పడుతోంది.

Do You Know Which Country Leads in AI Usage India s Surprising Rank Revealed

ఇక ప్రపంచవ్యాప్తంగా 87 శాతం కంపెనీలు ఏఐను తమ వ్యాపార ప్రణాళికల్లో ప్రధాన ప్రాధాన్యంగా గుర్తించినట్లు స్టాన్‌ ఫర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ తన పరిశోధనలో వెల్లడించింది. మొత్తంగా 76 శాతం సంస్థలు కనీసం ఒక విభాగంలో ఏఐను వాడుతున్నట్లు స్పష్టమైంది. ఇక భారత్ లో ఏఐను బ్యాంకింగ్, ఈ- కామర్స్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+