ఏఐ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ కొత్తరోగం వచ్చే ఛాన్స్ ??
ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా మరింత అభివృద్ధి చెందుతోంది. అలానే AI వినియోగం కూడా రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, అకౌంటెంట్లు, మార్కెటింగ్ నిపుణులు, హెచ్‌ఆర్ సిబ్బంది ఇలా దాదాపు అన్ని రంగాల్లో ఉద్యోగులు తమ రోజువారీ పనుల్లో AI టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈమెయిల్స్ రాయడం, డేటా విశ్లేషణ, రిపోర్టులు తయారు చేయడం, కంటెంట్ తయారీ వంటి పనుల్లో AI పెద్ద సహాయంగా మారింది. అయితే ఈ సాంకేతికత పనిని వేగంగా పూర్తి చేయడంలో సహాయపడుతున్నప్పటికీ, దీర్ఘకాలంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
Harvard Business Reviewలో ప్రచురితమైన ఒక తాజా పరిశోధన ప్రకారం, ఎక్కువగా AI సాధనాలను ఉపయోగించడం వల్ల "AI బ్రెయిన్ ఫ్రై" అనే కొత్త రకమైన మానసిక అలసట ఏర్పడుతున్నట్లు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని 1,488 మంది ఉద్యోగులను సర్వే చేసి, వారి పనిలో AI వినియోగం ఎలా ఉందో మరియు దాని ప్రభావం ఏమిటో విశ్లేషించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఉద్యోగుల్లో సుమారు 14 శాతం మంది ఈ రకమైన మానసిక అలసటను అనుభవిస్తున్నట్లు చెప్పారు. అయితే అన్ని రంగాల్లో ప్రభావం ఒకేలా లేదని పరిశోధన వెల్లడించింది.

AI బ్రెయిన్ ఫ్రై అంటే ఏమిటి?
పరిశోధకుల ప్రకారం.. ఉద్యోగులు ఒకేసారి అనేక AI టూల్స్‌ను ఉపయోగిస్తూ, వాటి అవుట్‌పుట్‌ను పరిశీలిస్తూ పని చేయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియలో మెదడుపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీని వల్ల మానసిక అలసట, దృష్టి కేంద్రీకరణలో సమస్యలు, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, తలనొప్పి, పని మీద ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితినే "AI బ్రెయిన్ ఫ్రై" అని పిలుస్తున్నారు.
ఏ రంగాల్లో ఎక్కువ ప్రభావం?
మార్కెటింగ్ రంగం - 26%
హెచ్‌ఆర్ (మానవ వనరులు) - 19.3%
ఆపరేషన్స్ విభాగం - 17.9%
సాఫ్ట్‌వేర్ డెవలపర్లు - 17.8%
ఇక న్యాయ రంగంలో పనిచేసేవారిలో మాత్రం ఈ సమస్య తక్కువగా ఉంది. కేవలం 5.6 శాతం మంది మాత్రమే ఈ రకమైన మానసిక అలసటను అనుభవిస్తున్నట్లు తెలిపారు.
AI బ్రెయిన్ ఫ్రై ఉన్న ఉద్యోగులు సాధారణంగా ఇతరుల కంటే 14 శాతం ఎక్కువ మానసిక శ్రమ పెట్టాల్సి వస్తోంది. అలాగే వారు 12 శాతం ఎక్కువ అలసట అనుభవిస్తున్నట్లు పరిశోధన తెలిపింది. దీని ప్రభావం పనితీరుపై కూడా కనిపిస్తోంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమస్యను ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఉద్యోగం వదిలే అవకాశాలు కూడా 39 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధన చెబుతోంది.
అయితే AI ఎప్పుడూ నెగటివ్ ప్రభావమే చూపుతుందని కాదు. ఒకే పనిని పదేపదే చేయాల్సి వచ్చే సందర్భాల్లో AI ఉపయోగించడం వల్ల ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుంది. పరిశోధన ప్రకారం పునరావృత పనులను AIతో చేయించుకుంటే ఉద్యోగుల్లో బర్న్‌అవుట్ స్థాయి 15 శాతం వరకు తగ్గింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం AIను సహాయక సాధనంగా ఉపయోగించడం మంచిది. కానీ ప్రతి చిన్న పనికీ పూర్తిగా AIపై ఆధారపడితే మెదడుపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అందుకే ఉద్యోగులు AIను తెలివిగా ఉపయోగించుకోవడం, మధ్య మధ్యలో విరామాలు తీసుకోవడం, పనిని సమతుల్యంగా ప్లాన్ చేసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
-
7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Realme 16 5G.. ఎంతంటే ?? -
Gmail ఐడీ నచ్చలేదా? ఈ సింపుల్ ట్రిక్ తో వెంటనే యూజర్ నేమ్ ఛేంజ్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..!












Click it and Unblock the Notifications