స్టూడెంట్స్ కు గూగుల్ గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏఐ టూల్స్ నేర్చుకోండి..
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం భారీగా పెరిగిపోయింది. ఏఐ సాంకేతికత ప్రతి రంగంలోనూ వ్యాప్తి చెందుతోంది. మానవుడు పరిష్కరించలేని ఎన్నో సవాళ్లు, సమస్యలను ఏఐ చిటికెలో సమాధానం అందిస్తోంది. భవిష్యత్తులో ఏఐ మరింత అభివృద్ది చెందుతోంది. నేటి యువత కచ్చితంగా ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
If you’re a student in India - you’ve just been granted access to a FREE Gemini upgrade worth ₹19,500 for one year 🥳✨
— Google India (@GoogleIndia) July 15, 2025
Claim and get free access to Veo 3, Gemini in Google apps, and 2TB storage 🔗 https://t.co/3Hc8Yjzbw2.@GeminiApp pic.twitter.com/IRwLst3kCi
అయితే తాజాగా ఇండియన్ స్టూడెంట్స్ కు గూగుల్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాది పాటూ ఫ్రీగా ఏఐ టూల్స్ ను వాడుకోవచ్చని ప్రకటించింది. జెమినీ ఫర్ స్టూడెంట్స్ పేరుతో 18 ఏళ్లు నిండిన విద్యార్థులు ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందవచ్చని తెలిపింది. అంతేకాక దీంతో పాటూ 2 టీబీ క్లౌడ్ స్టోరేజీ కూడా ఉచితంగా లభిస్తుంది.

అయితే జెమినీ ఏఐ టూల్ ను ఫ్రీగా వినియోగించుకోవాలంటే ముందు గూగుల్ ఆఫర్ పేజీ లో మన డీటెయిల్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15లోపు దీనిని పూర్తి చేయాలి. ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత గూగుల్ లో పవర్ ఫుల్ ఏఐ మోడల్ అయిన జెమినీ 2.5 ప్రోను యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఇవి వినియోగించాలంటే రూ.19,500 కట్టాల్సి ఉంటుంది. కానీ విద్యార్థులకు ఏడాది పాటు ఫ్రీగా అందిస్తోంది గూగుల్. ఇక టూల్ లో చదువుకోడానికి, రైటింగ్, రీసెర్చ్, ఉద్యోగానికి సంబంధించి కావాల్సిన విషయాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications