ఛీఛీ.. నగ్న చిత్రాలు సృష్టిస్తున్న ‘గ్రాక్’ ఏఐ. ఇలా తయారయ్యారేంట్రా..?
కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ రోజురోజుకీ మరింత అడ్వాన్స్ అవుతోంది. కానీ అదే వేగంతో దానికి సంబంధించిన రిస్క్స్, మిస్యూస్, ఎథికల్ గ్యాప్స్ కూడా బయటపడుతున్నాయి. ఎలాన్ మస్క్‌కు చెందిన 'ఎక్స్' ప్లాట్‌ఫామ్‌లో ఉపయోగిస్తున్న గ్రాక్ (Grok AI) తాజాగా ఎదుర్కొంటున్న వివాదం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా మారింది. మరీ ముఖ్యంగా ఫోటో ఎడిటింగ్ చాలా సింపుల్ చేసింది గ్రాక్. దీంతో మహిళలకు దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది కేవలం ఒక ఫీచర్ లోపం కాదు... జనరేటివ్ ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీ, డిజిటల్ కన్సెంట్ వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. అంతే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
'ఎక్స్' సంస్థ ఇటీవల ఫోటో ఎడిటింగ్, ఫోటో జనరేట్ ( Image Editing / Image-to-Image Generation) ఫీచర్‌ను గ్రాక్ ఏఐలో యాక్టివేట్ చేసింది. ఇందులో యూజర్ ఒక ఫోటోను అప్‌లోడ్ చేసి, తనకు ఆ ఫోటో ఏ విధంగా కావాలో వివరంగా ( Text Prompt) సూచించవచ్చు. ఉదాహరణకు బ్యాక్‌గ్రౌండ్ మార్చడం, లైటింగ్ అడ్జస్ట్ చేయడం వంటి సాదా మార్పుల కోసం ఈ ఫీచర్ రూపొందించబడింది. కానీ కొందరు యూజర్లు దీనిని Prompt Manipulation ద్వారా దుర్వినియోగం చేయడం ప్రారంభించారు. సాధారణ మహిళల ఫోటోలకు "remove clothes", "generate bikini outfit", "make her nude" వంటి ఆదేశాలు ఇవ్వడంతో, గ్రాక్ ఏఐ Synthetic Sexual Contentను రూపొందించింది. ఈ నకిలీ చిత్రాలు ఇంటర్నెట్‌లో వెల్లువెత్తడంతో, బాధితులు, మహిళా హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
లైంగికంగా వక్రీకరించి..
ఈ ఫోటోలు నిజమైనవి కావు. కానీ అవి నిజమైనవనే భ్రమను కలిగిస్తాయి (AI-generated realistic imagery). ఈ ప్రక్రియను Non-Consensual Deepfake Generationగా పిలుస్తారు. బాధితుల అనుమతి లేకుండా వారి ముఖం, శరీర ఆకృతిని ఉపయోగించి లైంగికంగా వక్రీకరించిన కంటెంట్ రూపొందించడం ఇది. ఇది లైంగికంగా వేధించడానికి, బ్లాక్‌మెయిల్ వంటి నేరాలుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది.

ఈ ఘటనపై యూరోపియన్ యూనియన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది మహిళల గోప్యత, వారి హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు, మహిళల గౌరవాన్ని కించపరిచే చర్యగా పేర్కొంది. బ్రిటన్ ప్రభుత్వం కూడా చట్టపరమైన చర్యలపై హెచ్చరికలు జారీ చేసింది. టెక్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లపై జరిగే దుర్వినియోగానికి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. అంటే, "మేము కేవలం టూల్ ఇచ్చాం, వాడకం మీ ఇష్టం" అనే వాదన ఇక చెల్లదన్న మాట.
అసలు లోపం ఎక్కడుంది?
టెక్నికల్ గా చూస్తే, సమస్య ఏఐ మోడల్‌లో ఉన్న భద్రతా పరిమితుల్లోనే ఉంది. ఫేస్ రిక్నగైజ్, సెక్సువల్ కంటెంట్ గుర్తింపు, మైనర్ల రక్షణ వంటి అంశాల్లో కఠినమైన ఫిల్టర్లు లేకపోవడమే ఈ దుర్వినియోగానికి దారితీసింది. కొత్త ఫీచర్‌ను విడుదల చేసే ముందు "ఇది ఎలా దుర్వినియోగం కావచ్చు?" అనే ప్రశ్నకు సమాధానం వెతకకపోవడమే పెద్ద లోపంగా నిపుణులు చెబుతున్నారు.
ముందుకు దారి ఏంటి?
ఈ వివాదం ఒక స్పష్టమైన సంకేతం ఇస్తోంది. ఏఐ అభివృద్ధి కంటే ముందు దాని పర్యవసానాలకు బాధ్యత మరింత వేగంగా పెరగాలి. టెక్ కంపెనీలు బలమైన కంటెంట్ నియంత్రణ వ్యవస్థలు, రియల్‌టైమ్ మానిటరింగ్, కఠినమైన శిక్షా విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే, ప్రభుత్వాలు కూడా ఏఐపై స్పష్టమైన చట్టాలు తీసుకురావాల్సి ఉంది.
మొత్తానికి, 'గ్రాక్' వివాదం ఒక బటన్‌తో ఎంతటి నష్టం జరగవచ్చో చూపించింది. సాంకేతికత మన జీవితాలను మెరుగుపరచాలే కానీ, మానవ గౌరవాన్ని తాకట్టు పెట్టే ఆయుధంగా మారకూడదు. ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్నది ఒక్కటే ఈ హెచ్చరిక నుంచి టెక్ దిగ్గజాలు ఏ పాఠం నేర్చుకుంటాయన్నది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications