Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

OpenAI లో ఇండియన్ ఇంజినీర్- ఏకంగా చీఫ్ పోస్ట్: మనోళ్ల చెయ్యి పడితే గానీ సెట్ అవ్వదు

OpenAI Vijay Raji: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఓపెన్‌ఏఐ.. తన అప్లికేషన్ల విభాగాన్ని పునర్వ్యవస్థీకరిస్తోంది. ఈ క్రమంలోనే 1.1 బిలియన్ డాలర్లతో స్టాట్‌సిగ్‌ను కొనుగోలు చేసింది. దీనికి అదనంగా ఈ విభాగానికి విజయ్ రాజీని సీటీఓ ఆఫ్ అప్లికేషన్స్‌గా నియమించింది. ఈ మేరకు ఓపెన్ ఏఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయాన్ని అటు విజయ్ రాజీ కూడా ధృవీకరించారు. స్టాట్ సిగ్ ను ఓపెన్ ఏఐ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

ఈ పునర్వ్యవస్థీకరణకు ప్రధాన సూత్రధారి స్టాట్‌సిగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ రాజీ. ఈ ఒప్పందం కుదిరిన వెంటనే ఆయన ఓపెన్‌ఏఐలో చేరుతారు. ఓపెన్ ఏఐ సీటీఓ ఆఫ్ అప్లికేషన్స్ అనే కొత్త హోదాను ఆయన కోసమే సృష్టించడం గమనార్హం. ఫిడ్జి సిమోకు నేరుగా రిపోర్ట్ చేస్తారాయన. చాట్‌జీపీటీ, కోడెక్స్‌కు సంబంధించిన ఉత్పత్తి ఇంజినీరింగ్‌తో పాటు ఓపెన్‌ఏఐ ప్రొడక్షన్ పోర్ట్‌ఫోలియోలోని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆయన పరిధిలోకి వస్తుంది.

Indian-origin engineer Vijay Raji named new Applications CTO of OpenAI

ఇన్‌స్టాకార్ట్ మాజీ బాస్ ఫిడ్జి సిమో.. కిందటి నెల 18న ఓపెన్‌ఏఐ కొత్త సీఈఓ ఆఫ్ అప్లికేషన్స్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీని తరువాత అతికొద్ది రోజులకే స్టాట్ సిగ్ ను ఓపెన్ ఏఐ కొనుగోలు చేయడం, దాని వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ రాజీని అత్యున్నత హోదాలో సంస్థలోకి తీసుకోవడం చకచకా సాగిపోయాయి. ఈ టేకోవర్ డీల్ తుది దశలో ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఖరారవుతుందని ఓపెన్ ఏఐ వర్గాలు బ్లూమ్ బర్గ్ కు వెల్లడించాయి.

దీని తర్వాత, స్టాట్‌సిగ్ సిబ్బందిని ఓపెన్‌ఏఐ ఉద్యోగులుగా గుర్తిస్తుంది. ఇది ఇండిపెండెంట్ గా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సియాటిల్ ప్రధాన కార్యాలయం నుంచి కస్టమర్లకు సేవలు అందిస్తుంది. ఏ/బీ టెస్టింగ్ టూల్స్‌కు ప్రసిద్ధి చెందిన స్టాట్‌సిగ్ ను కొనుగోలు చేయడం వల్ల ప్రొడక్షన్, ఆప్టిమైజేషన్‌లో ఓపెన్‌ఏఐకి బలమైన పునాదిని లభిస్తుందని చెబుతున్నారు. చాట్‌జీపీటీ, ఇతర వినియోగదారు సేవలను విస్తరించడంలో స్టాట్ సిగ్ ప్రధాన పాత్రను పోషిస్తుందని అంచనా వేస్తోన్నారు.

ఓపెన్ ఏఐలో చోటు చేసుకుంటోన్న ఈ మార్పులు ఇక్కడితో ఆగట్లేదు. గతంలో ఇంజినీరింగ్ విభాగం చీఫ్ గా ఉన్న శ్రీనివాస్ నారాయణన్, సీటీఓ ఆఫ్ బీ2బీ అప్లికేషన్స్ అనే కొత్తగా సృష్టించిన సీ-సూట్ హోదాకు ప్రమోట్ అయ్యారు. నారాయణన్ చాట్‌జీపీటీ, డెవలపర్‌ల కోసం ఏపీఐ, సంబంధిత టూల్స్ అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. కొత్త హోదాలో స్టార్టప్‌లు, సంస్థలు, ప్రభుత్వ క్లయింట్‌లతో సహా అన్ని వ్యాపార ఆధారిత ఉత్పత్తులను పర్యవేక్షిస్తారు. ఈయన నేరుగా సీఓఓ బ్రాడ్ లైట్‌క్యాప్‌కు రిపోర్ట్ చేస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+