మెటాలో లేఆఫ్ అయ్యారా ? భారీ జీతంతో జాబ్ ఆఫర్ చేస్తున్న భారతీయుడు..!
కృత్రిమ మేథ కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఆవిరైపోతున్నాయి. ఇదే క్రమంలో అమెరికా టెక్ దిగ్గజం మెటా కూడా తాజాగా 600 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఏఐ వాడకంతో అనవసర ఖర్చు తగ్గించుకుని లాభాలు పెంచుకునేందుకు మెటా చేసిన ఈ ప్రయత్నంతో 600 మంది రోడ్డున పడ్డారు. అదే సమయంలో వీరిని ఆదుకునేందుకు అమెరికాలోని ఓ స్టార్టప్ సంస్థ ముందుకొచ్చింది. భారతీయ మూలాలున్న సుదర్శన్ కామత్ అనే యువకుడు స్థాపించిన ఈ స్టార్టప్ ఇప్పుడు మెటా లేఆఫ్ ఉద్యోగులకు ఆహ్వానం పలుకుతోంది.
తాజాగా మెటా 600 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకున్నాక వారిని తమ సంస్దలోని ఇతర విభాగాల్లోకి మారేందుకు ఆఫర్ ఇచ్చింది. అదే సమయంలో అంతకన్నా భారీ వేతనాలతో వారిని తమ కంపెనీలోకి ఆహ్వానించేందుకు అమెరికాలని స్టార్టప్ సంస్థ స్మాలెస్ట్ ఏఐ సిద్దమైంది. దీంతో సంస్థ వ్యవస్థాపకుడు అయిన భారతీయ మూలాలున్న సుదర్శన్ కామత్ ఏకంగా ఎక్స్ లోనే ఈ జాబ్ ఆఫర్ పెట్టేశారు. దీంతో ఈ పోస్ట్ సైతం వైరల్ అవుతోంది.

కామత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ లో.. తమ కంపెనీ స్పీచ్ టీమ్‌ను నియమిస్తోందని పేర్కొన్నారు. అలాగే 2 లక్షల నుంచి 3 లక్షల డాలర్ల ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తమ సంస్ధలో చేరే వారికి సౌకర్యవంతమైన ఈక్విటీ ఎంపికలను కూడా ఇస్తున్నారు. "స్పీచ్ ఎవాల్యుయేషన్స్, స్పీచ్ జనరేషన్, ఫుల్ డ్యూప్లెక్స్ స్పీచ్ టు స్పీచ్‌తో అనుభవం కోసం చూస్తున్నట్లు కామత్ తన పోస్టులో వెల్లడించారు.

Laid off from Meta?
— Sudarshan Kamath (@kamath_sutra) October 23, 2025
We are hiring in speech team for Smallest AI in San Francisco!
Comp - 200-600K $ base
Equity - Flexible
Looking for - experience with speech evals, speech generation, full duplex speech to speech
Must be - fkin smart and hungry.
DM me.
అలా ఏఐ రాక కారణంగా మెటాలో ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ఇప్పుడు ఈ స్మాలెస్ట్ డాట్ ఏఐ వైపు చూస్తున్నారు. అదీ ఏఐ ఉద్యోగ నైపుణ్యాల అవసరం ఉన్న సంస్థ వీరిని ఆహ్వానిస్తోంది. దీంతో ఆయా ఉద్యోగులు ఇప్పుడు స్మాలెస్ట్ ఏఐ ఇచ్చిన ఆఫర్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు మెటా మాత్రం తాము తీసేసిన ఉద్యోగుల్ని సైతం ఎక్కడో చోట సర్దుబాటు చేసుకోవడం ద్వారా మానవవనరుల్ని వృథా చేయకూడదని భావిస్తోంది. దీంతో ఏఐ తరంలో ఇదో కీలక పరిణామంగా బావిస్తున్నారు.












Click it and Unblock the Notifications