దూసుకుపోతున్న ఏఐ - ఉద్యోగాల కోత, భారీ సవాల్..!!
21వ శాతాబ్దపు సాంకేతిక అద్భుతం ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్). ప్రపంచ వ్యాప్తంగా ఆధుని క సాంకేతికత విస్తరిస్తోంది. ఏఐ పేరు ప్రతీ చోట వ్యాపిస్తోంది. అనేక రంగాల్లో సత్తా చాటుతోంది. అనేక సంచలన మార్పులకు వేదికగా నిలుస్తోంది. విస్తరిస్తున్న ఏఐ తో పలు కీలక రంగాల్లో ఊహించని విప్లవం కనిపిస్తోంది. అదే సమయంలో ఈ ఐఏ ద్వారా జరిగే నష్టా ల పైనా చర్చ జరుగుతోంది. గత మూడేళ్ల కాలంలో ఏఐ వినియోగం పెరిగింది. ఏఐ వినియోగం ద్వారా సాధిస్తున్న ఫలితాలతో మరిన్ని రంగాలకు వ్యాపిస్తోంది. అయితే, ఇదే సమయంలో ఉద్యో గాల పైన ప్రభావం చూపుతోంది.
ఏఐ..కృత్రిమ మేధ ఒక విధంగా మొత్తం వ్యవస్థనే ప్రభావితం చేస్తోంది. ఊహించని మార్పులకు కారణంగా నిలుస్తోంది. ఏఐ ద్వారా సేవల్లో సానుకూలత పెరుగుతుండగా.. ఉపాధి కల్పనలో మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏఐ ప్రవేశం తో పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగలకు భారీ స్థాయిలో లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. గత మూడేళ్ల కాలంలో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అసలు ఎఐ లేని రంగమే లేదనే విధంగా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ఎఐలో ఆధిపత్యం కోసం సాంకేతికతను అధికంగా వినియోగంచే దేశాలు పోటీపడుతున్నాయి. ప్రజల అవసరాలు, సేవలకు అనుగుణంగా ఆవిష్కరణల కోసం ఏఐ పరిధి పెరిగింది. అయితే, ఉద్యోగుల పైన నెగటివ్ ప్రభావం ఆందోళనగా మారుతోంది.

టెక్నాలజీ రంగంలో ఏఐ ప్రత్యేక ముద్ర వేసుకుంది. వేలాది మందిపైన వేటు వేయ టానికి కారణంగా ఈ ఏఐ. అయితే, ఏఐ వచ్చిన కొత్తల్లో దీని కారణంగా ఎవరి ఉద్యోగాలకు ముప్పు లేదని చెప్పేవారు. అయితే.. ఈ వినియోగం పెరిగే కొద్దీ ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి.
ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు సైతం ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తెలి గించాయి. ఇతర కంపెనీల కంటే పై చేయి సాధించే క్రమంలో ఏఐకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అమెజాన్ సైతం తాజాగా తమ ఉద్యోగులను తెలిగించింది.
ఇంటెల్ సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగుల తొలిగింపుకు రంగం సిద్దం చేసింది. దీంతో, పలు కంపెనీల్లో ఫ్రెషర్ల నియామకాలు తగ్గి పోయాయి. ఎంట్రీ లెవల్ నియామకాలు తగ్గిపోయాయి. దీంతో, రానున్న రోజుల్లో ఏఐ వినియోగం తప్పని సరిగా మారే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో ఉద్యోగుల పైన ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆందోళనగా మారుతోంది.












Click it and Unblock the Notifications