నిండా పాతికేళ్లు కూడా లేని పిలగాడికి రూ.2,196 కోట్ల జీతం ఆఫర్ చేసిన జుకర్‌

సర్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మయం అవుతున్న ప్రస్తుత పరస్థితుల్లో మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. సూపర్‌ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ కోసం 24 సంవత్సరాల ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్ మాట్ డీట్కేను నియమించుకోవడానికి ఏకంగా 2,196 కోట్ల రూపాయల జీతాన్ని ఆఫర్ చేశారు.

మొదట మెటా మాట్ డిట్కేకు 125 మిలియన్ డాలర్ల వేతనాన్ని ఆఫర్ చేశారు. మన కరెన్సీలో ఇది 1,098 కోట్ల రూపాయలు. ఈ ఆఫర్ ను డిట్కే తిరస్కరించాడు. దీంతో జుకర్‌బర్గ్ అతనిని ఒప్పించేందుకు వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. జీతాన్ని ఒకేసారి రెట్టింపు చేశారు. 265 మిలియన్ డాలర్లు అంటే.. మన కరెన్సీలో 2,196 కోట్ల రూపాయల వేతనం ఇవ్వడానికి అంగీకరించారు.

Mark Zuckerberg offers Rs 2 196 salary to Young AI researcher

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తారంగా పెరుగుతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజాల మధ్య పోటీ నెలకొనడమే దీనికి కారణం అని అమెరికన్ మీడియా అంచనా వేసింది. సిలికాన్ వ్యాలీలో AI టాలెంట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొందని తెలిపింది. మెటా సూపర్‌ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను నిర్మించడానికి అత్యుత్తమ టెక్ నిపుణులను ఆకర్షించడానికి భారీగా ఖర్చు చేస్తోంది.

ఇందులో భాగంగానే మాట్ డీట్కేకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా రూ. 2,196 కోట్ల భారీ ప్యాకేజీని ఆఫర్ చేశారని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న AI స్టార్టప్ 'వెర్సెప్ట్' పై జుకర్ బర్గ్ దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడని, దీనికోసం డిట్కేను అపాయింట్ చేయాలనేది ఆయన తుది నిర్ణయమని పేర్కొంది.

ఈ భారీ ఆఫర్ కు మాట్ డీట్కేకు అంగీకరించాడని, త్వరలోనే అతను మెటా సూపర్‌ ఇంటెలిజెన్స్ టీమ్‌లో AI రీసెర్చర్ చేరవచ్చని అంచనా వేసింది ది న్యూయార్క్ టైమ్స్. వాస్తవ రూపాన్ని దాల్చితే- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అతి పెద్ద అపాయింట్మెంట్ ఇదే అవుతుంది.

వాషింగ్టన్ యూనివర్శిటీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో పీహెచ్‌డీ చేపట్టాడు మాట్ డీట్కే. దీన్ని మధ్యలోనే విడిచిపెట్టి సియాటెల్‌లోని అలెన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ AI (AI2)లో రియాలిటీ వరల్డ్ రీసెర్చర్ గా అడుగుపెట్టాడు. మోల్మో డెవలప్మెంట్ టీమ్ లీడర్ గా వ్యవహరించాడు. మోల్మో అనేది టెక్స్ట్ మాత్రమే కాకుండా ఫొటోలు, ఆడియోను కూడా ప్రాసెస్ చేయగల అత్యాధునిక మల్టీమోడల్ చాట్‌బాట్.

మోల్మోపై ఆయన చేసిన కృషికి AI రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక సమ్మిట్ NeurIPS 2022లో 'అవుట్‌స్టాండింగ్ పేపర్ అవార్డు' లభించింది. 2023 చివరి నుండి డీట్కేను నియమించుకోవడానికి మెటా ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు అవి ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. జుకర్‌బర్గ్ వ్యక్తిగత జోక్యం, పెరిగిన ప్యాకేజీ వంటి పరిణామాలు.. మెటా సూపర్‌ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌లో చేరడానికి డిట్కేకు బాటలు వేసినట్టయింది. సూపర్‌ ఇంటెలిజెన్స్ ల్యాబ్ లో ఇప్పటికే బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది మెటా.

OpenAI, గూగుల్, ఆపిల్ వంటి ప్రత్యర్థి సంస్థల నుండీ టాప్ రీసెర్చర్లను హైర్ చేసుకుంటోంది. డీట్కేతో పాటు, ఆపిల్ AI మోడల్స్ టీమ్ మాజీ అధిపతి రుయోమింగ్ పాంగ్ కూడా ఈ ల్యాబ్‌లో చేరారు. ఆయనకు $200 మిలియన్లకు పైగా పరిహారం ప్యాకేజీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+