ఉద్యోగులకు షాక్: ఒక్కసారిగా 13,000 మందిపై కంపెనీ వేటు!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో సరఫరాదారు అయిన రాబర్ట్ బోష్ లేఆఫ్ బాట పట్టింది. జర్మనీకి చెందిన అతి పెద్ద ఆటో సప్లయర్ కంపెనీ ఇది. ఏకంగా 13,000 ఉద్యోగులను తొలగించనుంది. ఆటోమొబైల్ రంగంలో నెలకొన్న మందగమనం, ఖర్చులు పెరగడం, ఆటో సప్లయింగ్ లో కాంపిటీషన్ పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మార్కెటింగ్, మానవ వనరులు వంటి కొన్ని డివిజన్లల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేసుకోవడం కూడా ఈ లేఆఫ్ కు ఓ కారణమైంది.

పెరిగిన ఖర్చుల వల్ల ఆటో మొబైల్ సప్లయింగ్ విభాగంలో ఏటా 2.5 బిలియన్ యూరోలు అంటే.. సుమారు 2.9 బిలియన్ డాలర్ల మేర వ్యయ భారం తాజా నిర్ణయానికి కారణమని ప్రకటించింది. డిమాండ్ తక్కువగా ఉండటం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న లాజిస్టిక్ ఇబ్బందులు, సప్లయింగ్ లో నెలకొన్న అవరోధాలు.. సంస్థ ఆర్థిక పరిస్థితులను మరింత క్లిష్టతరం చేసిందని వివరణ ఇచ్చింది బోష్ యాజమన్యం. ఒక్కో సెంట్ కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తుతోందని పేర్కొంది.

Massive Layoffs Bosch to Cut 13 000 Jobs Due to Sluggish Market Conditions

వీలైనంత మేరకు ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఉద్యోగుల కోతలతో పాటు, మెటీరియల్ పర్ఛేజింగ్ అండ్ డెలివరీ, నిర్వహణ ఖర్చులను తగ్గించనుంది. మేనేజర్, అంతకంటే పైస్థాయి ఉద్యోగులకు కల్పిస్తోన్న సౌకర్యాల్లో కూడా కోత పెట్టాలని నిర్ణయించింది. ఆఫీస్ భవన సముదాయాల నిర్వహణ పెట్టుబడులను తగ్గించనుంది. లాజిస్టిక్స్, సప్లయింగ్ చైన్ ను క్రమబద్ధీకరించాలని బోష్ లక్ష్యంగా పెట్టుకుంది.

2030 చివరి వరకు జర్మనీలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలను దశలవారీగా తగ్గిస్తామని మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యుడు స్టీఫెన్ గ్రోష్ తెలిపారు. ఖర్చును తగ్గించుకునే క్రమంలో అడ్మిన్, సేల్స్, ఆర్ అండ్ డీ, ప్రొడక్షన్ డివిజన్లల్లో ఎక్స్ ట్రా మ్యాన్ పవర్ ను తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని అన్నారు. పోటీతత్వంపై అత్యవసరంగా దృష్టి సారించాల్సిన అవసరం తలెత్తిందని, ఖర్చులను శాశ్వతంగా తగ్గించుకోవాల్సి ఉందని చెప్పారు.

13,000 మంది ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం బాధాకరమే అయినప్పటికీ.. తప్పట్లేదని, మరో మార్గం లేదని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి బోష్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,18,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ వల్ల యూరప్ కార్ మేకర్స్ అధిక భారాన్ని భరించాల్సి వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+