Microsoft లో టీమ్ AI కి డబ్బులే డబ్బులు- దెబ్బకు లైఫ్ సెటిల్
Microsoft: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొమ్ములు తిరిగిన కంపెనీలు కూడా దీని బారిన పడుతున్నాయి. భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు సైతం ఇదివరకే దశలవారీగా లేఆఫ్స్ ప్రకటించాయి.
మైక్రోసాఫ్ట్ సైతం దీనికి మినహాయింపేమీ కాదు. దాదాపుగా 15,000 మంది ఉద్యోగులను తొలగించిందా టెక్ దిగ్గజం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను మళ్లిస్తోంది. మ్యాన్ పవర్ కంటే కూడా AI ని గట్టిగా నమ్ముకుందా సంస్థ.

ఈ లేఆఫ్స్ తరువాత ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీనిపై బిజినెస్ ఇన్ సైడర్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్స్ ప్రకారం.. AI టూల్స్‌ను ఎక్కువగా ఉపయోగించే ఉద్యోగులకు ప్రోత్సాహకాలను సైతం అందిస్తోంది.
AI సంబంధిత ప్రాజెక్టులకు సహకరించే వారికి ప్రోత్సాహకాలు అందించేలా మేనేజర్‌లకు సూచనలు జారీ చేసింది. దీనివల్ల ఈ డివిజన్ లో పనిచేసే ఉద్యోగులకు అందరి కంటే ఎక్కువ జీతం లభిస్తోంది. బోనస్‌లు, స్టాక్ ఆప్షన్‌లు లేకుండా బేసిక్ శాలరీలకు సంబంధించిన వివరాలు మాత్రమేనని బిజినెస్ ఇన్ సైడర్ తెలిపింది. వాటిని కూడా కలిపితే జీతాల మొత్తం బారీగా పెరుగుతుంది.
డివిజన్లవారీగా వేతనాల అంకెలు డాలర్లల్లో..
సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్- 82,971 - 2,84,000,
ప్రొడక్ట్ మేనేజర్- 1,22,800 - 2,50,000
డేటా ఇంజినీరింగ్- 1,44,855 - 2,64,000
డేటా సైన్స్- 1,21,200 - 2,74,500
కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఇంజినీరింగ్- 1,26,422 - 2,39,585
టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్- 120,900 - 2,38,000
అప్లైడ్ సైన్స్- 1,27,200 - 2,61,103
హార్డ్‌వేర్ ఇంజినీరింగ్- 1,36,000 - 2,70,641
క్లౌడ్ నెట్‌వర్క్ ఇంజినీరింగ్- 1,22,700 - 220,716
రీసెర్చ్, అప్లైడ్ అండ్ డేటా సైన్స్- 85,821 - 2,08,800
బిజినెస్ అనలిటిక్స్- 1,59,300 - 191,580. ఈ వివరాలు 2025 ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు ప్రాసెస్ చేసిన 5,400 వీసా దరఖాస్తుల ఆధారంగా సేకరించినవి.












Click it and Unblock the Notifications