Grok: బికినీకి నో చెప్పేస్తున్న గ్రోక్..! ఆ యూజర్లకు షాకులు..!
మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ లో ఏఐ చాట్ బోట్ గ్రోక్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. యూజర్లు అడిగిందే తడవుగా ఫొటోల్ని మార్పింగ్ చేయడం, సాధారణ వస్త్రధారణతో ఉన్న వారిని బికినీల్లోకి, నగ్నంగా మార్చేయడం వంటి రిక్వెస్ట్ లను ఆమోదించడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని గ్రోక్ లో మార్పులు చేయాలని, ఇలాంటి రిక్వెస్ట్ లు ఆమోదించకుండా కట్టడి చేయాలని ఎక్స్ ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ తమ ఛాట్ బోట్ గ్రోక్ లో మార్పులు చేసింది.
గ్రోక్ పనితీరుపై విమర్శల నేపథ్యంలో ఎక్స్ తాజాగా తమ ప్లాట్ ఫామ్ లో పలు మార్పులు చేసింది. దీని ప్రకారం గ్రోక్ మహిళల లైంగిక చిత్రాలను రూపొందించడం ఆపేసింది. బికినీలు లేదా లైంగిక భంగిమల్లో ఉన్న మహిళల చిత్రాలను రూపొందించేందుకు నిరాకరించడం ప్రారంభించింది. ఈ మార్పు ప్రస్తుతం బ్రిటన్ లో ప్రధానంగా కనిపిస్తోంది. భారత్ పై మాత్రం అమల్లోకి రాలేదని తెలుస్తోంది.

ఏఐ బాట్ ఇప్పుడు లైంగిక ఫొటోల కోసం చేసే అభ్యర్థనలను తిరస్కరిస్తోంది. దురదృష్టవశాత్తు నేను ఆ రకమైన చిత్రాన్ని రూపొందించలేను వంటి సందేశాలు ఇందులో కనిపిస్తున్నాయి. వినియోగదారులు స్విమ్‌సూట్‌లలో ఉన్న మహిళల చిత్రాలను లేదా స్పష్టమైన దృశ్యాలను అడిగినప్పుడు, గ్రోక్ ఇప్పుడు ఇలా సమాధానమిస్తోంది. దీంతో ఇలాంటి రిక్వెస్ట్ లు చేసే యూజర్లకు షాకులు తప్పడం లేదు.

గతంలో గ్రోక్ ఇమేజ్ టూల్స్‌ను పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు పరిమితం చేయడం ద్వారా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఎక్స్ ప్రయత్నించింది. కానీ దీనిపైనా ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వారు భద్రతా సమస్యను పరిష్కరించడం కంటే క్లోజ్ ఫొటోల దుర్వినియోగాన్ని ప్రీమియం సేవగా సమర్థవంతంగా మార్చారనే ఆరోపణలు వచ్చాయి. భారత్ వంటి దేశాలు అశ్లీల డీప్‌ఫేక్ కంటెంట్‌ను తొలగించి భద్రతా చర్యలను బలోపేతం చేయాలని ఆదేశించగా, మరికొన్ని దేశాలూ కఠినమైన వైఖరిని తీసుకున్నాయి. గ్రోక్ వంటి ఏఐ టూల్స్ ఉపయోగించి రూపొందించబడిన ఏకాభిప్రాయం లేని లైంగిక చిత్రాల గురించి ఆందోళనల వల్ల మలేషియా, ఇండోనేషియా ఈ ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకున్నాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications