Perplexity AI: ఆ ఏఐ బ్రౌజర్ తో ఈ రెండు ఉద్యోగాలకు చెక్..! సీఈవో ప్రకటన..!
కృత్రిమ మేథ రాకతో ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలపై వీటి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఇప్పటికే ఏఐ రాకతో ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్ధితి కనిపిస్తుండగా.. కొత్త ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అదే సమయంలో ఏఐ ప్లాట్ ఫామ్ లు కొత్త కొత్త ఫీచర్లతో దూసుకొస్తున్నాయి. వీటి రాకతో మరికొన్ని ఉద్యోగాలను కృత్రిమ మేథ భర్తీ చేసేస్తోంది. ఇదే క్రమంలో పర్ ప్లెక్సిటీ ఏఐ బ్రౌజర్ ఎంట్రీ రెండు ఉద్యోగాలకు ముప్పు తెస్తోంది.
తాము కృత్రిమ మేథ సాయంతో అందుబాటులోకి తెస్తున్న బ్రౌజర్ వల్ల ఆఫీసుల్లో ఇకపై రెండు రకాల ఉద్యోగాలకు సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం తప్పుతుందని పర్ ప్లెక్సిటీ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ సీఈవో అరవింద్ శ్రీనివాస్ ఓ ప్రకటన చేశారు. తమ కంపెనీ అభివృద్ధి చేసిన కొత్త సాధనం త్వరలో ఆఫీసుల్లో అత్యంత కీలకమైన రెండు వైట్-కాలర్ ఉద్యోగాలను భర్తీ చేయగలదని నమ్ముతున్నట్లు తెలిపారు.

కామెట్ అనే ఏఐ ఆథారిత స్థానిక బ్రౌజర్ మీ సగటు చాట్‌బాట్ కాదని ఆయన చెప్తున్నారు. దీని వల్ల ప్రస్తుతం ఆఫీసుల్లో నియమించుకుంటున్న ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు, రిక్రూటర్ ఉద్యోగాలను ఇది భర్తీ చేస్తుందని తెలిపారు. గూగుల్ క్యాలెండర్, జీమెయిల్, లింక్డ్ ఇన్ తో ఈ బ్రౌజర్ అనుసంధానమై పనిచేస్తుందని అరవింద్ వెల్లడించారు. ఇది షెడ్యూలింగ్, ఇమెయిల్‌లు, అభ్యర్థి సోర్సింగ్, నియామక కెరీర్ కూడా నిర్వహించగలదని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆఫీసుల్లో అమల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు, రిక్రూటర్ల ఉద్యోగాలు కామెట్ అనవసరంగా చేయడానికి రూపొందించబడిన రెండు పాత్రలు అని ఆయన తేల్చేశారు. ఇప్పటికే ఆరంభ దశలో ఉన్నప్పటికీ తమ బ్రౌజర్ ఈ రెండు ఉద్యోగాల విధుల్ని చేసి పెడుతుందంటున్నారు. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ల కోసం కామెట్ క్యాలెండర్‌లను నిర్వహిస్తుందని, సమావేశ సామగ్రిని సిద్ధం చేస్తుందని, ఇమెయిల్‌లను ట్రాక్ చేస్తుందని, షెడ్యూలింగ్ సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు.












Click it and Unblock the Notifications