రిలయన్స్- ఫేస్‌బుక్ బిగ్ అనౌన్స్ మెంట్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కూడా ఈ రంగంలో అడుగు పెట్టింది. దాని అనుబంధ సంస్థ రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాతో కలిసి ప్రత్యేకంగా జాయింట్ వెంచర్ ను నెలకొల్పింది. రిలయన్స్ ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ (REIL) గా దీనికి పేరు పెట్టారు. ఎంటర్‌ప్రైజ్ AI సేవలను అభివృద్ధి చేయడం, మార్కెటింగ్ పై ఈ సంస్థ దృష్టి సారిస్తుంది.
ఈ మేరకు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందాల ప్రక్రియ పూర్తయింది. ఈ జాయింట్ వెంచర్ ఒప్పందం ప్రకారం REIL లో రిలయన్స్ ఇంటెలిజెన్స్ 70 శాతం వాటాను కలిగి ఉంటుంది. మిగిలిన 30 శాతం వాటాను ఫేస్‌బుక్ సొంతం చేసుకుంటుంది. రెండు భాగస్వామ్య సంస్థలు దాదాపు 855 కోట్ల రూపాయలను ప్రారంభ పెట్టుబడిగా పెట్టనున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసులను మరింత విస్తృతం చేసే దిశగా కార్యకలాపాలు కొనసాగిస్తాయి.

క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్స్ కింద రిలయన్స్ ఇంటెలిజెన్స్ 20,00,000 ఈక్విటీ షేర్లను సబ్‌స్క్రైబ్ చేసింది, దీని విలువ రెండు కోట్ల రూపాయలు. ఈ డీల్‌లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రిలయన్స్ గ్రూప్ లోని ఇతర కంపెనీకి చెందిన ప్రమోటర్లకు ఎటువంటి సంబంధం లేదని, పూర్తిస్థాయిలో స్వతంత్ర సంస్థగా రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ కార్యకలాపాలు ఉంటాయని పేర్కొంది. అలాగే REIL స్థాపనకు ఎటువంటి ప్రభుత్వ లేదా రెగ్యులేటరీ కమిషన్ల ఆమోదాలు అవసరం లేదని కంపెనీ తెలిపింది.
AI Everywhere for Everyone.. అనే నినాదంతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సేవలను అన్ని రంగాలకూ విస్తారంగా అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. మెటాతో కలిసి ఓ కొత్త AI జాయింట్ వెంచర్‌ను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఇంధనం, రిటైల్, టెలికాం, మీడియా, మానుఫ్యాక్చరింగ్ రంగంలో ఓపెన్ మోడల్స్, ఏఐ టూల్స్ తో అనుసంధానిస్తామని, ఎంటర్‌ప్రైజ్-రెడీ AIని అందించడానికి మెటాతో ఒక ప్రత్యేక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
దీని కోసం రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరుతో ఓ కొత్త సంస్థను నెలకొల్పబోతోన్నామని ముఖేష్ అంబానీ ప్రకటించారు. దీన్ని మరింత డెవలప్ చేయడానికి మెటాతో పాటు గూగుల్ సహకారాన్ని తీసుకుంటోన్నట్లు చెప్పారు. తొలిదశలో పారిశ్రామిక రంగంలో దీన్ని విస్త్రతం చేస్తామని, క్రమంగా అన్ని సేవలకూ దీన్ని వినియోగించుకునేలా చర్యలు చేపడతామని అన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications