OpenAI సీఈఓ సీటుకే ఎర్త్ పడింది..
OpenAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల టెక్ రంగంలో సంభవించబోయే విపరిణామాల గురించి ఒక్క ముక్కలో తేల్చి చెప్పారు. AI వల్ల భవిష్యత్తులో తన ఉద్యోగానికి కూడా ముప్పు వాటిల్లుతుందని స్పష్టం చేశారు. తన ఉద్యోగాన్ని కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని గురించి భయపడట్లేదని వ్యాఖ్యానించారు.
కన్వర్సేషన్స్ విత్ టైలర్ అనే పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. OpenAI తో సహా అనేక మల్టీ నేషనల్ కంపెనీలకు నాయకత్వం వహించే సామర్థ్యం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఉందని అన్నారు. సీఈఓ బాధ్యతలను ఏఐ తీసుకునే రోజు త్వరలోనే వస్తుందని సామ్ ఆల్ట్‌మన్ చెప్పారు. ఒకవేళ ఓపెన్ ఏఐకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గనక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాకపోతే అది తన తప్పే అవుతుందని, ఆ దిశగా దాన్ని తీర్చిదిద్దడంలో విఫలమైనట్టేనని వ్యాఖ్యానించారు.

రాబోయే సంవత్సరాల్లో AI వ్యవస్థలు కీలక విభాగాలను నిర్వహించగలగనంత వేగంగా ప్రస్తుత టెక్నాలజీ అభివృద్ధి చెందుతోందని సామ్ ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల టెక్ సహా అనేక రంగాలకు చెందిన పరిశ్రమల్లో ఇప్పటికే అనేక మార్పులు చోటు చేసుకుంటోన్నాయని గుర్తు చేశారు. క్రమంగా ఇది- ఆయా కంపెనీల లీడర్ షిప్ సామర్థ్యాన్ని కూడా మార్చివేస్తుందని అభిప్రాయపడ్డారు. ఫలితంగా తాను కూడా ఉద్యోగాన్ని కోల్పోవచ్చని అన్నారు.
అలాంటి పరిస్థితే వస్తే తాను వ్యవసాయం చేస్తానని ఆల్ట్‌మన్ అన్నారు. ఖాళీ సమయంలో వ్యవసాయం చేయడం అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. తనకు పొలం ఉందని, అందులో వ్యవసాయం చేస్తానని పేర్కొన్నారు. ట్రాక్టర్ నడపడం, పంటలు కోయడం, విత్తనాలు నాటటం అంటే తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమని ఆల్ట్‌మన్ వివరించారు. చాట్‌జీపీటీ ఓపెన్ AI ని ప్రపంచ ప్రఖ్యాత సంస్థగా మార్చకముందు తాను ఇవి చేసేవాడినని ఆయన తెలిపారు.
సమీప భవిష్యత్తులో AI వల్ల అనేక ఉద్యోగాలు పోతాయని, ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆల్ట్‌మన్ అంగీకరించారు. దీనివల్ల కాలక్రమేణా కొత్త అవకాశాలు వస్తాయననే నమ్మకం తనకు ఉందని అన్నారు. ప్రస్తుతం యువత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై పట్టును పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆల్ట్‌మన్ స్పష్టం చేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications