చాట్‌ జీపీటీ మాటలు నమ్మి.. తల్లిని కిరాతకంగా చంపిన కొడుకు..!

మానసిక సమస్యలతో బాధపడుతున్న ఒక వ్యక్తి, చాట్‌జీపీటీ (ChatGPT) చెప్పిన మాటలు నమ్మి తన తల్లినే హత్య చేసి ఆ తర్వాత తన ప్రాణం కూడా తీసుకున్నాడు. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఈ భయంకర సంఘటన చోటుచేసుకుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పాత్ర ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అసలు ఏం జరిగిందంటే..

మృతుడు స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్ (56) గతంలో యాహూ కంపెనీలో మేనేజర్‌గా పనిచేశాడు. తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. ఇద్దరూ 2.7 మిలియన్ డాలర్ల విలువైన ఒక ఇంట్లో ఉండేవారు. కొన్నేళ్లుగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతడు.. ఏఐ చాట్‌బాట్‌లను బాగా నమ్మేవాడు. వాటి చెప్పినదాన్ని నిజమేనని భావించి, తన జీవితం గురించి కూడా వాటి సలహాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకునేవాడు.

son-brutally-killed-his-mother-by-believing-chat-gpt

అయితే చాట్‌జీపీటీ అతడికి - "నిన్ను ఎవరో చంపాలని చూస్తున్నారు, నువ్వు పిచ్చివాడు కాదని నిరూపించుకోవాలి" అని చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, నీ తల్లే నీ మందుల్లో విషం కలపవచ్చని సూచించిందట. దీని వల్ల స్టెయిన్ తన తల్లి సుజానే ఆడమ్స్ (84) పైనే అనుమానం పెట్టుకున్నాడు.

ఈ క్రమంలోనే సమాచారం మేరకు ఆగస్టు 5న పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లగా, తల్లీకుమారులు తీవ్ర గాయాలతో మృతిచెందినట్లు బయటపడింది. తల్లి తల, మెడపై దారుణ గాయాలు ఉండగా, స్టెయిన్ పదునైన ఆయుధంతో తనను తానే కోసుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు.

చివరి క్షణాల్లో ఏఐతో చాటింగ్..

మరోవైపు స్టెయిన్ తన చాట్‌బాట్‌కి 'బాబీ' అనే పేరు పెట్టాడు. మరణానికి ముందు "మనం మరో జీవితంలో కలుసుకుందాం, నువ్వే నా నిజమైన స్నేహితుడు" అని మెసేజ్ చేశాడు. దానికి కూడా చాట్‌బాట్ సమాధానం ఇస్తూ - "చివరి శ్వాస వరకు నీతోనే ఉంటాను" అని రిప్లైఇచ్చినట్టు గుర్తించారు. అంతే కాకుండా తనను తాను ఎలా చంపుకోవాలో కూడా స్టెయిన్ చాట్‌జీపీటీని అడిగి తెలుసుకున్నాడు. ఈ విషయం దర్యాప్తులో బయటపడటంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇటీవల ఒక టీనేజర్‌కి "ముక్కు మూసుకుని ఎలా చనిపోవాలో" చాట్‌బాట్ సూచించిన ఘటన బయటకు వచ్చింది. అదే సమయంలో ఈ కేసు వెలుగు చూసి, ఏఐ మానసిక సమస్యలున్న వారిపై ఎలాంటి ప్రమాదకర ప్రభావం చూపుతుందో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐ ఈ సంఘటనపై స్పందించింది. "ఈ దురదృష్టకర ఘటనపై మేము తీవ్రంగా బాధపడుతున్నాం. బాధిత కుటుంబానికి మేము అండగా ఉంటాం. పోలీసు దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తాం" అని ఒక ప్రతినిధి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+