"ఏఐ" షూస్ వచ్చేశాయ్.. వేసుకుంటే గాల్లో తేలిపోతారు..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రస్తుతం అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. మానవుడికి ఏఐ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మానవుడు టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వస్తువులకు ఆధారపడిపోయాడు. ప్రస్తుత డిజిటల్ యుగంలో అన్నీ డిజిటల్ మయంగా మారిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ దగ్గర్నుంచి.. స్మార్ట్ వాచ్, బ్యాండ్ లు, స్మార్ట్ రింగ్ లు, స్మార్ట్ కిచెన్, స్మార్ట్ ఇయర్ బడ్స్, రోబోలను మనం చూశాం. ఇప్పుడు ఆ లిస్టులోకి షూస్ కూడా చేరాయి. అవును.. ఇంపాక్టో ఆధ్వర్యంలో ఏఐ ఆధారిత షూస్ అందుబాటులోకి వచ్చాయి.
హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో తాజాగా నిర్వహించిన డ్యాన్స్ కాంపెటిషన్ లో ఈ ఏఐ ఆధారిత షూస్ కనువిందు చేశాయి. వీటిని ఇంపాక్టో కంపెనీ తయారుచేసింది. అత్యాధునిక సాంకేతికతతో పూర్తిగా స్వదేశీ ప్రతిభతో వీటిని తయారు చేసింది ఇంపాక్టో సంస్థ. ఈ ఏఐ షూస్ బ్రాండ్ తయారీ ప్రస్తుతం కోల్ కతాలో మాత్రమే ఉంది. అయితే ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ వేదికలైన అమేజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా.. తదితర షాపింగ్ సైట్స్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చని ఇంపాక్టో సంస్థ తెలిపింది.
మేము ఈ షూస్ ను కోల్ కతాలో తయారు చేశాం. మేము అమెజాన్ లో ట్రెండింగ్ నెం. 1 గా ఉన్నాం. ఈ ఏఐ షూస్ గోవాలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ లో అధికంగా సేల్స్ అవుతున్నాయి. త్వరలోనే హైదరాబాద్ లో స్టోర్ ఓపెన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ ఏఐ షూస్ యాప్ ద్వారా పనిచేస్తాయి. కాళ్లు మసాజ్ చేయడంతో పాటు అడుగులను లెక్కిస్తుంది. యాపిల్ వాచ్ కంటే సమర్థవంతంగా ఈ యాప్ పనిచేస్తుంది. అలాగే ఎంత సమయంపాటు శారీరక శ్రమ చేశారు..? ఎన్ని క్యాలరీలు బర్న్ అయ్యాయని చెబుతుంది.

అలాగే ఈ ఏఐ షూస్ లో షూలో ఇంటిగ్రేటెడ్ లైట్లను అమర్చారు.రాత్రిపూట నడుస్తున్నప్పుడు, తక్కువ వెలుతురు ఉన్న ప్రాంతాల్లో అవి వాటికవే ఆన్ అయి వెలుగుతాయి. ఇక ఈ ఏఐ షూస్ కు ఒకసారి ఛార్జింగ్ చేస్తే రెండు, మూడు రోజులపాటు పని చేస్తాయని ఇంపాక్టో సంస్థ తెలిపింది. వీటి ధర రూ.10 నుంచి 12 వేల వరకు ఉందని సమాచారం.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications