ఏఐ సలహాలతో వ్యాపారంలో దూసుకెళ్లండి..!
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం భారీగా పెరిగిపోయింది. ఏఐ సాంకేతికత ప్రతి రంగంలోనూ వ్యాప్తి చెందుతోంది. మానవుడు పరిష్కరించలేని ఎన్నో సవాళ్లు, సమస్యలను ఏఐ సెకన్ల వ్యవధిలోనే సమాధానం అందిస్తోంది. భవిష్యత్తులో ఏఐ మరింత అభివృద్ది చెందుతోంది. నేటి యువత అటు విద్యాపరంగా లేదా ఉద్యోగ పరంగా లేదా వ్యాపార పరంగానైనా కచ్చితంగా ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు కీలక పరిశోధన వెల్లడైంది.
తాజాగా ప్రఖ్యాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, MIT స్లోన్ మేనేజ్‌మెంట్ రివ్యూ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచుకోవడానికి ఏఐ సాంకేతికత పై పెట్టుబడులు పెడుతున్న క్రమంలో ఏఐ వినియోగంతో వస్తున్న మార్పులపై ఈ రెండు సంస్థలు స్టడీ చేశాయి. ఈ స్టడీలో భాగంగా తయారీ, రిటైల్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఇంధనం, కమ్యూనికేషన్స్, మీడియా, టెక్నాలజీ.. తదితర కీలక రంగాలపై ఏఐ ప్రభావం ఎలా ఉండబోతోందని అధ్యయనం చేశాయి. అయితే ఈ స్టడీలో వచ్చిన ఫలితాలను వెల్లడించారు.

AI కేవలం సలహాలు అందించే సాంకేతికత టూల్ మాత్రమే కాకుండా వ్యాపారాలకు మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదుగుతోందని తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు. ఏఐ ఉపయోగించుకున్న కంపెనీలు గణనీయమైన పురోగతి సాధించాయని గుర్తించారు. ఏఐ.. ఎప్పటికప్పుడు వ్యాపార పద్ధతులను మెరుగుపరచడమే కాకుండా.. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన పూర్తి వివరాలను అందిస్తోందని తేలిందని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాక మానవ మేధస్సుకు AI ను జోడించడం ద్వారా కొత్త అవకాశాలు వెల్లువెత్తుతాయని ఈ అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications