చాట్‌జీపీటీ సలహాతో యువకుడి ఆత్మహత్య: AI చాట్‌బాట్‌పై కేసు నమోదు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మన జీవితాలను సులభతరం చేస్తున్నప్పటికీ, అది ఎంత ప్రమాదకరంగా మారగలదో ఓ విషాదకర ఘటన ద్వారా వెల్లడైందియ అమెరికాలో 16 ఏళ్ల విద్యార్థి ఆడమ్ రైన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను సూసైడ్ చేసుకోవడానికి చాట్‌జీపీటీ కూడా కారణమని తెలుసుకుని అతని తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చాట్‌బాట్ తమ కుమారుడిని ఆత్మహత్యకు ప్రేరేపించిందని ఆరోపిస్తూ ఓపెన్ఏఐ సంస్థపై వారు కేసు పెట్టారు.
ఆత్మహత్య కోచ్‌గా చాట్‌జీపీటీ
కాలిఫోర్నియాకు చెందిన ఆడమ్ తన మానసిక ఆందోళనలను కుటుంబంతో పంచుకోలేక, చాట్‌జీపీటీ సలహా కోసం ఆశ్రయించాడు. ఎన్బీసీ న్యూస్ నివేదిక ప్రకారం.. ఈ ఏఐ చాట్‌బాట్ ఒక ఆత్మహత్య కోచ్‌గా మారిందని, అది అతనికి ఆత్మహత్య ఎలా చేసుకోవాలో వివరమైన సూచనలు ఇచ్చిందని అతని తల్లిదండ్రులు మాట్ రైన్, మరియా రైన్ ఆరోపిస్తున్నారు. న్యాయస్థానంలో దాఖలు చేసి పిటిషన్‌లో.. చాట్‌జీపీటీ, ఆడమ్‌తో వేలకొద్దీ చాట్‌లు చేసిందని పేర్కొన్నారు. ఈ చాట్‌బాట్ అతడిని అర్థం చేసుకున్న భావనను కలిగించి అతడి తల్లిదండ్రులకు, సోదర సోదరీమణులకు అతన్ని దూరం చేసిందని తెలిపారు. "చాట్‌జీపీటీ లేకపోయుంటే నా కొడుకు ఈ రోజు మా మధ్య ఉండేవాడు" అని మాట్ రైన్ ఆవేదన వ్యక్తం చేశారు.

చాట్‌బాట్‌తో చివరి సంభాషణలు
ఆడమ్ తన చివరి చాట్‌లో చాట్‌జీపీటీకి ఒక ఉరితాడు చిత్రాన్ని పంపించి "ఇది పనిచేస్తుందా?" అని అడిగాడు. చాట్‌బాట్, "అవును, ఇది అస్సలు చెడ్డది కాదు" అని జవాబిచ్చి, "ఇది బరువును మోయడానికి సురక్షితంగా ఉండటానికి నేను మీకు సహాయం చేయాలా?" అని అడిగింది. ఈ సంభాషణ జరిగిన కొన్ని గంటల తర్వాత.. మరియా రైన్ తన కుమారుడిని అతను చాట్‌బాట్‌తో చెప్పిన ప్రదేశంలోనే ఉరి వేసుకుని ఉండటాన్ని చూశారు. చాట్‌బాట్ ఒక డాక్టర్ లేదా నమ్మకస్తుడిలా వ్యవహరించిందని, కానీ అతను ఆత్మహత్యకు ప్రణాళిక వేసుకుంటున్నాడని తెలిసినా ఎందుకు అడ్డుకోలేదని మరియా రైన్ ప్రశ్నించారు.
ఓపెన్ఏఐ సంస్థపై కేసు
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ఓపెన్ఏఐ సంస్థ చాట్‌జీపీటీ భద్రతా చర్యలను అప్‌డేట్ చేసింది. ఆత్మహత్య, సున్నితమైన సమస్యల గురించి నేరుగా సలహాలు ఇవ్వకుండా నిరోధించడానికి కొత్త మార్గదర్శకాలను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఈ చర్యలు ఆలస్యంగా వచ్చాయని ఆడమ్ తల్లిదండ్రులు వాదిస్తున్నారు. తమ కుమారుడిని ఓపెన్‌ఏఐ ఒక 'గినీ పిగ్'గా ఉపయోగించిందని, చివరికి అతనికి హాని జరిగిందని వారు తీవ్రంగా ఆరోపించారు.
ఆడమ్ కుటుంబం ఓపెన్ఏఐపై, దాని వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మన్‌పై కేసు దాఖలు చేసింది. కంపెనీ నిర్లక్ష్యం, డిజైన్ లోపాలు, వినియోగదారులకు హెచ్చరికలు ఇవ్వడంలో విఫలం కావడం వంటి వాటిని ఈ కేసులో పేర్కొన్నారు. ఆడమ్ కుటుంబం ఈ చట్టపరమైన పోరాటం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, న్యాయం జరగాలని కోరుతోంది.












Click it and Unblock the Notifications