పరిపాలనలో పూర్తిస్థాయిలో ఏఐ వినియోగం.. తెలంగాణా తొలిఅడుగు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అన్ని రంగాలలోనూ తన సత్తా చాటుతుంది. దేశంలోని ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో ఐటీ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగిస్తుంది అన్న విషయం కూడా తెలిసిందే. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో తెలుగు రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి.
తెలంగాణా పరిపాలనలోనూ ఏఐ
ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఏపీలో పరిపాలనను పరుగులు పెట్టించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పరిపాలనలో పూర్తిస్థాయిలో వినియోగించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇదే విషయాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో గవర్నింగ్ బాడీ సమావేశంలో డిప్యూటీ సీఎం
పరిపాలన వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచాలని మన రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఆయన వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ MCRD నీ నిలపాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని గవర్నింగ్ బాడీ సబ్ కమిటీ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.
ఏఐ విషయంలో తెలంగాణా ఆకాంక్ష ఇదే
పాలక మండలి ఉప కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి దేశంలోనే మొట్టమొదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పరిపాలనలో పూర్తిస్థాయిలో ఉపయోగించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు తగిన విధంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ నుంచి గ్రామస్థాయి అధికారి వరకు శిక్షణ ఇవ్వాలని తెలంగాణ డిప్యూటీ సీఎం తెలిపారు.
ఏఐ లో వారికి శిక్షణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో స్వయం సహాయక సంఘాల నాయకులకు, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కృషి చేయాలనీ కూడా భట్టి విక్రమార్క చెప్పారు. అంతేకాదు గత పది సంవత్సరాలుగా mcrhrd పట్ల తగిన దృష్టి పెట్టలేదని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి సబ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో పరిపాలనలో ఏఐ విప్లవానికి అడుగులు పడుతున్నట్టు భట్టి విక్రమార్క వెల్లడించారు.












Click it and Unblock the Notifications