తెలంగాణ సర్కార్ గుడ్‌ న్యూస్.. ఆ స్కూళ్లకు ఫ్రీ ఇంటర్నెట్‌.. డిజిటల్, ఏఐ క్లాసులు

తెలంగాణలోని విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్ కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా తెలంగాణలోని ప్రభుత్వ బడులకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై సాంకేతిక విద్యాబోధన, డిజిటల్ తరగతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) క్లాసులను బోధించనుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలోని 11,476 ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి జరిగిన ఒప్పందం ప్రకారం.. రాష్ట్రంలోని 5,992 స్కూల్స్ లో BSNL సంస్థ ఫ్రీగా ఇంటర్నెట్ అందిస్తోంది. అయితే వీటితోపాటు మరో 5,992 పాఠశాలలకు కూడా ఉచిత ఇంటర్నెట్ అందజేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ మేరకు BSNL సంస్థకు లేఖ రాసింది.

Telangana Government Schools to Get Free Internet Ushering in AI-Based Education

రానున్న 6 నెలల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం అమలు కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలోని ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో అబ్బాయిలకు ఒక‌టి, అమ్మాయిలకు ఒక‌టి యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల నిర్మాణాల‌ను చేప‌డ‌తామ‌ని ఇటీవల సీఎం రేవంత్ అన్నారు. అంతేకాక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో బ్యాక్ బెంచ్ లేకుండా యూ సీటింగ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో U ఆకారం సీటింగ్ అమలు చేయాలని ఇటీవల కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్‌, ఆశ్రమ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు అన్ని క్లాసుల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇది సక్సెస్ అయితే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+